Monday, 2 November 2026

పఠాన్‌ కోట్‌లో టెన్షన్‌..టెన్షన్‌..

C

– మరో ఉగ్రవాది హతం

పఠాన్‌కోట్‌/న్యూఢిల్లీ,జనవరి 3(జనంసాక్షి):పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌లో భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్‌ కొనసాగుతూనే ఉంది. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఈ వైమానిక స్థావరం ఆదివారం ఉదయం కూడా కాల్పులతో దద్దరిల్లింది. ఈ నేపథ్యంలో ఎయిర్‌బేస్‌లో నక్కిన ఒక ఉగ్రవాదిని భద్రతా దళాలు హతమార్చాయి. మరో ఉగ్రవాదిని కూడా హతమార్చినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఎయిర్‌బేస్‌లో భద్రతా దళాల ఆపరేషన్‌ కొనసాగుతున్నదని, ఇప్పటికే సైనిక దుస్తుల్లో ఉన్న ఉగ్రవాదులను జవాన్ల నుంచి వేరుచేసిన బలగాలు.. వారిని ఏరివేసేందుకు  ప్రయత్నిస్తున్నాయని కేంద్రంలోని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. అయితే ఇప్పటివరకు ఎయిర్‌బేస్‌లో ఎంతమంది ఉగ్రవాదులను  ఏరివేశారు, ఇంకా ఎంతమంది నక్కి ఉన్నారన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఎయిర్‌బేస్‌లో నక్కిన మరో ఇద్దరు ఉగ్రవాదులతో కమాండోల ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని, ఈ ఆపరేషన్‌ త్వరగా ముగుస్తుందని భావిస్తున్నామని కేంద్ర ¬ంశాఖ కార్యదర్శి రాజీవ్‌ మహర్షి ఢిల్లీలో ఆదివారం సాయంత్రం తెలిపారు. ఈ ఉగ్రవాద దాడి విషయంలో కేంద్రం వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారంటూ కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారు. దీంతో ఇప్పటివరకు ఈ ఘటనలో ఎంతమంది ఉగ్రవాదులు హతమయ్యారన్నది అధికారికంగా సరైన సమాచారం అందకపోవడం సందిగ్ధతకు దారితీస్తోంది. ఎయిర్‌బేస్‌పై దాడిచేసిన మొత్తం ఆరుగురు ఉగ్రవాదుల్లో ఐదుగురు చనిపోయినట్టు ఇప్పటివరకు అందిన సమాచారం. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎయిర్‌బేస్‌పై  దాడి చేసిన ఉగ్రవాదుల్లో నలుగురు శనివారం హతమయ్యారని ప్రకటించింది. ఎయిర్‌బేస్‌లో నక్కిన మరో ఇద్దరు ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఆపరేషన్‌ కొనసాగుతున్నదని తెలిపింది. ఎయిర్‌బేస్‌లో నక్కిన ఇద్దరు ఉగ్రవాదులు ఆదివారం ఉదయం కాల్పులకు తెగబడటంతో మళ్లీ కలకలం రేగింది. శనివారం ఉదయం పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఏడుగురు జవాన్లు మృతి చెందారు. 20 మంది గాయపడ్డారు. ఉగ్రవాదుల దాడిని దీటుగా తిప్పికొట్టిన బలగాలు నలుగురిని హతమార్చాయి. అయినా ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌ శనివారంతో ముగియలేదు. మరో ఇద్దరు ఉగ్రవాదులు ఎయిర్‌బేస్‌లో దాగి ఉన్నట్టు తేలడం.. ఆదివారం ఉదయం కాల్పులు చోటుచేసుకోవడంతో బలగాలు మరో ఆపరేషన్‌ చేపట్టాయి. ఎదురుకాల్పుల్లో ఇప్పటికే ఐదో ఉగ్రవాది మధాహ్నం హతమవ్వగా.. మరికొంత ప్రతిఘటన అనంతరం ఆరో ఉగ్రవాది కూడా మృతిచెందినట్టు సమాచారం అందుతోంది. దీనిని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. కాగా, ఎయిర్‌ బేస్‌ లో ఆదివారం

ఉదయం గ్రనేడ్‌ పేలిన ఘటనలో ఆర్మీ ఆఫీసర్‌ నిరంజన్‌ సింగ్‌ మృతిచెందగా, మరో ఐదుగురు సిబ్బంది గాయపడినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు తీసుకొచ్చిన గ్రనేడ్‌ నిర్వీర్యం చేస్తుండగా ఈ ఘటన సంభవించింది.

పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదులు

పఠాన్‌కోట్‌: పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నట్టు భద్రత బలగాలు నిర్ధారించాయి. ఉగ్రవాదులను సజీవంగా పట్టుకునేందుకు భద్రత బలగా

లు ఆపరేషన్‌ కొనసాగిస్తున్నాయి.ఆదివారం ఉదయం నుంచి పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌లో కూంబింగ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది.  ఐఈడీ పేలుడులో నిరంజన్‌ సింగ్‌ అనే అధికారి

మృతి చెందగా, మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. పేలుడు పదార్థాన్ని నిర్వీర్యం చేస్తుండగా ప్రమాదం జరిగింది. శనివారం పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు దాడి

చేసిన సంగతి తెలిసిందే. ఐదుగురు ఉగ్రవాదులను భద్రత బలగాలు హతమార్చగా, ఈ దాడిలో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.ఈమేరకు కేంద్ర ¬ంశాఖ కార్యదర్శి రాజీవ్‌ మెహ్రిషి ఇవాళ విూడియాతో మాట్లాడుతూ.. ఎయిర్‌ బేస్‌లో ఇంకా ఇద్దరు ఉగ్రవాదులు నక్కి ఉన్నారని తెలిపారు. నిఘా వర్గాల హెచ్చరికతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయని పేర్కొన్నారు. కాగా, పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌ ఎదురు కాల్పుల ఘటనలో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య ఏడుకు చేరింది.

ఆర్మీ దుస్తులే ప్రాణంగా బతికాడు..

‘ఆర్మీ డ్రెస్‌ అన్నా, ఆర్మీలో పనిచేయడమన్నా వాడికి ఎంతో ఇష్టం. చిన్నప్పటి నుంచి వాడి ఆశ, ఆశయం ఆర్మీలో చేరాలనే. అనుకున్నది సాధించాడు. ఆర్మీలో కల్నల్‌ స్థాయికి ఎదిగాడు. చివరికి అవే విధినిర్వహణలోనే ప్రాణాలు వదిలాడు’.. అంటూ తనకు కుమారుడు లెఫ్టినెట్‌ కల్నల్‌ నిరంజన్‌ కుమార్‌ జ్ఞాపకాలను నెమరేసుకున్నారు ఆయన తండ్రి. పఠాన్‌ కోట్‌ ఎయిర్‌ బేస్‌ పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో మరణించిన ఏడుగురు సైనికుల్లో నిరంజన్‌ ఒకరు. కేరళకు చెందిన ఆయన.. చిన్నప్పుడే తల్లిని కోల్పోయారు. ఆ తర్వాత బెంగళూరులో విద్యాభ్యాసం చేసి ఆర్మీలో చేరారు. జాతీయ భద్రతా దళం(ఎన్‌ఎస్‌ జీ)లో విధులు నిర్వహిస్తున్న కల్నల్‌ నిరంజన్‌.. విధినిర్వహణలో భాగంగా శనివారం తెల్లవారుజామునుంచి ఉగ్రమూకలతో పోరాడుతూ  ఆదివారం అనూహ్యరీతిలో మరణించారు. ఉగ్రవాదులు అమర్చిన గ్రేనేడ్‌ ను నిర్వీర్యం చేస్తుండగా ప్రమాదవశాత్తు అది పేలడంతో నిరంజన్‌ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో నలుగురు గాయపడ్డారు. నిరంజన్‌ మరణంతో బెంగళూరులోని ఆయన నివాసంతోపాటు కేరళలోని స్వగ్రామంలోనూ విషాద ఛాయలు అలముకున్నాయి. ‘నిరంజన్‌ చనిపోవడం ఓ వైపు బాధ కలిగిస్తున్నప్పటికీ, దేశం కోసం ప్రాణాలర్పించి మేం గర్వపడేలా చేశాడు’ అని ఆయన సోదరి విూడియాతో అన్నారు. పఠాన్‌ కోట్‌ ఎయిర్‌ బేస్‌ పై ఉగ్రదాడి ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు సైనికులు చనిపోగా, 20 మందికిపైగా గాయపడ్డారు. ఆరుగురు ఉగ్రవాదుల బలగాలు మట్టుపెట్టగలిగాయి. మరొకరి కోసం గాలింపు కొనసాగుతోంది.

పంజాబ్‌లో బీఎస్‌ఎఫ్‌ బలగాలను పెంచండి: సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌

పంజాబ్‌లో తరచూ ఉగ్రవాదులు జరుగుతోన్న నేపథ్యంలో రాష్ట్రంలో మరిన్ని బీఎస్‌ఎఫ్‌ బలగాలను మోహరింపజేయాలని పంజాబ్‌ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఇవాళ ఆయన విలేకరులతో మాట్లాడారు. పంజాబ్‌ను కూడా కేంద్ర ప్రభుత్వం సున్నిత ప్రాంతాల్లో ఒకటిగా పరిగణించి మరిన్ని భద్రతా బలగాలను రాష్ట్రానికి పంపాలని విజ్ఞప్తి చేశారు. టెర్రరిస్టుల దాడులను ఎదుర్కొనేందుకు త్వరలో స్పెషల్‌ కమాండోను ఏర్పాటు చేసి పటాన్‌కోట్‌లో నిఘా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

దాడికి పాల్పడే ముందు తల్లితో మాట్లాడిన ఉగ్రవాది

పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ ఏర్‌బేస్‌పై జరిగిన ఉగ్రదాడిలో పాల్గొన్న ఓ ఉగ్రవాది దాడికి పాల్పడే ముందు తన తల్లితో ఫోన్‌లో మాట్లాడాడు. సుసైడ్‌ మిషన్‌పై ఉన్నానని ఆ ఉగ్రవాది తన తల్లితో ఫోన్‌లో తెలిపాడు. తల్లి వైపు నుంచి సమాధానమేమి లేదు. ఉగ్రవాది తిరిగి మాట్లాడుతూ నేను సుసైడ్‌ మిషన్‌పై ఉన్నానని చెప్పి ఫోన్‌ కట్‌చేశాడు. పఠాన్‌కోట్‌ ఏర్‌బేస్‌ను పేల్చేందుకు ఉగ్రవాదులు కుట్రపన్ని నిన్న దాడికి తెగబడ్డ విషయం తెలిసిందే. ఉగ్రవాదులు దాడికి దిగే కొద్దిసేపటిముందే కేంద్ర నిఘా వర్గాలు ఈ ఫోన్‌ కాల్‌ను గుర్తించారు. అర్థరాత్రి దాటిన తర్వాత 1.58 గంటలకు 70 సెకన్లపాటు ఈ సంభాషణ జరిగింది. ఈ సంభాషణ జరిగిన రెండు గంటల అనంతరం ఉగ్రవాదులు ఏర్‌బేస్‌పై దాడికి దిగారు. భద్రతా దళాల అప్రమత్తతతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. 10 గంటల పాటు జరిగిన సుదీర్ఘ కాల్పుల అనంతరం నలుగురు ఉగ్రవాదులు హతమైయ్యారు. ఏయిర్‌ఫోర్స్‌కు చెందిన ముగ్గురు భద్రతా సిబ్బంది మృతిచెందారు. ఫోన్‌ కాల్‌ వెళ్లిన ప్రదేశం పాకిస్థాన్‌లోని గుర్తించతగని ఓ రహస్య ప్రదేశానికి వెళ్లినట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయి. ఉగ్రవాదులు పంజాబీ, ముల్తానీ భాషలో మాట్లాడినట్లుగా సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *