పదవి విరమణ చేసిన 15మంది పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించిన బి. యం. ఇ. యు . నాయకులు
సికింద్రాబాద్ ( జనం సాక్షి ) జీహెచ్ఎంసీ సికింద్రాబాద్, బేగంపేట్ జోనల్ పరిధిలో నేడు 15మంది పారిశుద్ధ్య కార్మికులు పదవీ విరమణ పొందారు. వారిని ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు ప్రకాష్, కార్యదర్శి నర్సింగ్ రావు ఆధ్వర్యంలో నేతలు మిఠాయిలు తినిపించి శాలువాలు కప్పి సన్మానించారు.. ఈ సందర్భంగా ప్రకాష్ మాట్లాడుతూ పదవి విరమణ పొందిన సహచర ఉద్యోగులు వారి పదవి కాలంలో ఎంతో అత్యుత్త సేవలు అందించారని కొనియాడారు.. వీరు ఉద్యోగ విరమణ అనంతరం కూడా మంచి ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని దేవుడ్ని ప్రార్దిస్తున్నట్లు తెలిపారు. పదవి విరమణ చేసిన వీరిని బాధ్యతతో చూసుకోవాలని కుటుంబ సభ్యులకు సూచించారు.. ఉద్యోగ విరమణ చేసిన వారికి కూడా హెల్త్ కార్డులను అందించే ప్రయత్నం చేస్తున్నామని.. అతిత్వరలో ఆ శుభవార్తను కూడా వింటారని వెల్లడించారు..