*పదో తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసిన అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వి.యం అబ్రహం*.అలంపూర్ జూన్ 30 (జనంసాక్షి)
తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీమతి సబిత ఇంద్రసేనారెడ్డి పదో తరగతి ఫలితాలను గురువారం విడుదల చేశారు.ఇట్టి ఫలితాల్లో పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని విద్యార్థులు,వారి తల్లిదండ్రులకు పేరు పేరున అలంపూర్ మండల కేంద్రంలో శాసనసభ్యులు డాక్టర్ వి యం అబ్రహం హార్థిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈసందర్బంగా
అయన మాట్లాడుతూ చిత్తశుద్ధితో చదివి మంచి మార్కులతో రాష్ట్రంలోనే అలంపూర్ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.అదేవిధంగా పదో తరగతి ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు కృంగిపోకుండా మరింత పట్టుదలతో చదివి వచ్చే సప్లమెంటరీ ఫలితాల్లో ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి ప్రాధాన్యత ఇస్తుందని తెలియజేశారు.సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు