కడప : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిపై ఆరోగ్య శాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి మరోసారి తన అసంతృప్తిని వెళ్లగక్కారు. పార్టీలో పనిచేసేవారిని ముఖ్యమంత్రిని గుర్తించటం లేదని ఆయన శనివారమిక్కడ ఆరోపించారు. ఈ సారి జిల్లాకు ఎమ్మెల్సీ స్థానం దక్కే సూచనలు లేవని డీఎల్ అన్నారు. పౌర పరఫరాల వస్తువులపై ముఖ్యమంత్రి, మంత్రుల ఫోటోలు వేసుకోవటం సిగ్గుచేటు అని ఆయన వ్యాఖ్యానించారు.




