పనులు వేగవంతంగా పూర్తి చేయాలి : దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

గత కొన్ని రోజులుగా లింగోజిగూడా డివిజన్ పరిధిలోని మైత్రి నగర్ నందు జరుగుతున్న వరదనీరు , డ్రైన్స్ సమస్యల మీద పలుమార్లు అధికారులచే కలిసి ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి  , మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు తో కలిసి పర్యటించడం జరిగింది.పనులు వేగవంతం చేయాలని అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది.దానిలో భాగంగా ఈ రోజు మళ్ళీ అట్టి ప్రదేశంలో పర్యటించారు.అక్కడ జరుగుతున్న పనుల మీద సంతృప్తి వ్యక్తం చేశారు.పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు.వరదనీరు పోవడానికి వాటర్ డ్రైన్స్ ఎత్తుపల్లాలను చూసుకొని పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.అలాగే డ్రైన్స్ , వాటర్ పైప్ లైన్స్ పనులు కూడా పూర్తి చేయాలని సూచించారు.కాలనీవాసులు ఎవరు ఇబ్బందులు పడకుండా వారికి కనీస సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.ఇట్టి కార్యక్రమంలో జీ.హెచ్.ఏం.సీ.డి.ఈ.కనకయ్య, డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి,శ్రీకాంత్,శ్రీధర్,మధుసూదన్ రెడ్డి,తిరుపతి రాజు,కృష్ణ రెడ్డి,పాండు,రమేష్ తదితరులు పాల్గొన్నారు.