పరిటాల రవి ప్రధాన అనుచరుడు చమన్ గుండెపోటుతో మృతి
అనంతపురం జిల్లా మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ చమన్ సాబ్ గుండెపోటుతో మృతి. 2014 నుంచి 2017 మే వరకు ఆయన ఛైర్మన్ గాపనిచేశారు. మాజీ ఎమ్మెల్యే పరిటాల రవీంద్రకు ముఖ్య అనుచరుడుగా ఉండేవాడు. 2004 లో కాంగ్రెసు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి ఫ్యాక్షన్ హత్యాల నేపథ్యంలో ఆయన దాదాపు ఎనిమిది సంవత్సరాలు అజ్ఞాతంలో ఉన్నారు. 2012 సంవత్సరంలో అజ్ఞాతం నుంచి బయటకు వచ్చారు. 2014 వ సంవత్సరంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రామగిరి మండలం నుంచి తెలుగు దేశం పార్టీ తరుపున జడ్పిటీసిగా గెలుపోంది జడ్పీ ఛైర్మన్ అయ్యారు. ముందుగా జరిగిన ఒప్పందం మేరకు రెండున్నర సంవత్సరం తరువాత తన పదవికీ రాజీనామా చేశారు. సోమవారం మధ్యాహ్నం హఠాత్తుగా వచ్చిన గుండెపోటుతో మృతి చెందారు.