Wednesday, 4 November 2026

అంటువ్యాధులపై అప్రమత్తం అవసరం 

ఏలూరు,మే7(జ‌నం సాక్షి):  సీజనల్‌ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యాదికారులు  అన్నారు. గ్రామాల్లో అపారిశుద్ధాన్ని నివారించకపోతే ప్రజలు వ్యాధులబారిన పడాల్సి వస్తుందన్నారు. పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులు, ఈవోఆర్‌డీలు గ్రామాల్లో నివాసం ఉండకపోవడంవల్లే పారిశుద్ధ్యంపై తగిన దృష్టి సారించలేకపోతున్నారన్నారు. అలాగే పంచాయతీ అధికారులు పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని  ఆదేశించారు. డ్రైన్ల నిర్వహణపై  ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించడానికి పంచాయతీ అధికారులే కారణమన్నారు.