హైదరాబాద్ : పరిశ్రమ శాఖపై మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి పరిశ్రమల శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశంలో జిల్లాల వారీగా ఎస్‌ఈజెడ్‌లు, పారిశ్రామికవాడల అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో ఇతర కంపెనీల పెట్టుబడుల అంశంపై కూడా చర్చించినట్లు సమాచారం.




