పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి శ్రమదానంలో అందరూ భాగస్వాములు కావాలి.. అడిషనల్ కలెక్టర్ ముజామిల్ ఖాన్..

సిద్దిపేట అర్బన్, జూన్ 10( జనం సాక్షి): గ్రామాల్లో ప్రతి ఒక్కరు శ్రమదానం లో భాగస్వామ్యులు అయి  తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అడిషనల్ కలెక్టర్ ముజామీల్ ఖాన్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్ రహదారిపై రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్ల ముళ్ళ పొదలు తొలగించి గుంతలు ఏర్పాటు చేసి చెట్లకు నీరు పోశారు. ప్రతి శుక్రవారం శ్రమదానం నిర్వహించి ప్రజలందరినీ కార్యక్రమాల్లో పాల్గొనేలా చూడాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రేణుక శ్రీనివాస్, ఎంపీటీసీ మమత యాదగిరి, ఉప సర్పంచ్ కేకే రావు, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఎద్దు యాదగిరి, సభ్యులు సంపత్ యాదవ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.