విశాఖపట్నం : నగరంలోని విమానాశ్రయంలో పర్యాటకశాఖ స్టాల్‌ను కేంద్ర పర్యాటక శాఖామంత్రి చిరంజీవి ప్రారంభించారు. శనివారం విశాఖ- భీమిలి బీచ్ కారిడార్ పనులను ప్రారంభించేందుకు ఆయన నగరానికి వచ్చారు. విశాఖ, భీమిలి బీచ్‌ల మధ్య ఉన్న బీచ్‌లతో పాటు పర్యాటక స్థలాలు, బౌద్ధారామాలను అభివృద్ధి చేసేందుకు పర్యాటక శాఖ రూ.45 కోట్లు కేటాయించిందని ఆయన తెలిపారు. వీటి పనులను ఈ సాయంత్రం చిరంజీవి ప్రారంభిస్తారు.




