Monday, 2 November 2026

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి : శ్రీధర్‌బాబు

కరీంనగర్‌, జూలై 31 (జనంసాక్షి) :  పర్యావరణ పరిరక్షణ, వాతావరణ కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరు విరివిగా మొక్కలు నాటాలని రాష్ట్రపౌర సరఫరాల శాఖ సందర్భంగా మంగళవారం నగరంలోని సప్తగిరి కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమా నికి మంత్రి అతిథిóగా హజరై విద్యార్థులతో కలి సి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ స్వచ్ఛమైన గాలి, నీరు, ప్రకృతి పూర్వీకు లు మనకు ఇచ్చిన ఆస్తి అని, దానిని కాపాడి భావి తరాలకు అందించాల్సిన బాధ్యత అని అ న్నారు. మొక్కలు నాటి పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని, కాలుష్య వాతావర ణంలో ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణం అవుతుంద న్నారు. అడువులు అంతరించిపోవడం వల్ల వ ర్షాలు ఆలస్యంగా కురుస్తున్నాయని, వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు. పంటల కు వర్షాలు మాలధారమని, వర్షాలు కురిసేందు కు తోడ్పడే చెట్లను పెంచాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా తీసుకొని ప్రతి ఇంటిలో మొక్క నాటి నగరాన్ని గ్రీన్‌సిటీగా మారుస్తామని అన్నారు. ప్రవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన జరగాలని, ఉత్తీర్ణత శాతం పెంచాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్‌ టీచర్లున్నారని, గుణాత్మక విద్యాబోధనతో ఉత్తమ విద్యార్థులుగా తీర్చిది ద్దారన్నారు. విద్యార్థులలో ఆత్మస్టైర్యం, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం పెంపొందించి అన్ని రంగాలతో రాణించేలా ప్రోత్సహించాలని ఉపాధ్యాయుల సూచించారు. కేంద్ర ప్రభుత్వం అటవి ప్రాంతాలలో గిరిజనులకు అటవి సంపదను ఉపయోగించుకొని జీవనోపాధి పొందుటకు కృషి చేస్తుందని అన్నారు. ప్రభుత్వ విప్‌ ఆరెపల్లి మోహన్‌ మాట్లాడుతూ కాలుష్య నివారణకు మొక్కలు నాటాలని, జిల్లాలో ఉపాది హామీ పథకం ద్వారా రోడ్లకు ఇరువైపుల మొక్కలు నాటాలన్నారు. ఆరోగ్యకరమైన వాతావరణానికి మొక్కలు నాటాలని, పచ్చని చెట్లే ప్రగతికి మెట్లన్నారు. ఈ సంవత్సరం సైతం ప్రభుత్వ పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌, కేడీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌ కె.రవీందర్‌ రావు, జిల్లా విద్యాధికారి లింగయ్య, డ్వామా పి.జి.జి. మనోహర్‌, డివిజనల్‌ ఫారెస్టు అధికారులు డి. నర్సయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *