మేడ్చల్,నవంబర్22(జనంసాక్షి): మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. పర్వతాపురంలో రాజిరెడ్డి (38) అనే బిల్డర్‌ను దుండగులు వేటకొడవళ్లతో నరికి హతమార్చారు. రాజిరెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ హత్యకు దారి తీసిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుడు రాజిరెడ్డి హైదరాబాద్ పరిధిలోని చంపాపేట చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. శవపరీక్ష నిమిత్తం రాజిరెడ్డి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.




