పల్లె ప్రగతి పనులను వేగవంతం చేయాలి. మండల ప్రత్యేక అధికారి జ్యోతి పద్మ, ఎంపిడివో శంకరయ్య.
నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్.గ్రామాల్లో పల్లే ప్రగతి పనులు వేగవంతం చేయాలని ,జిల్లా సంక్షేమ అధికారిని జ్యోతి పద్మ,ఎంపిడివో శంకరయ్య అన్నారు.శనివారం మండల పరిధిలోని దిర్శించర్ల,కల్లూరు గ్రామాల్లో 5 వ విడత పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో డ్రైనేజీ లను పరిశుభ్రం చేయించాలని, వీధుల వెంట అపరిశుభ్రంగా ఉంచకుండా చెత్తను పంచాయతి ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డ్ తరలించాలన్నారు. ఆయా కార్యక్రమంలో జెడ్పీటీసీ రాపోలు నరసయ్య, విద్యుత్ శాఖ ఏ.ఈ శ్రీనివాస్,సర్పంచులు మాగంటి మాధవి, పల్లే పంగ నాగరాజు, గ్రామ ప్రత్యేక అధికారి సతీష్ రెడ్డి,పంచాయతీ కార్యదర్శులు రమా, పద్మ, తదితరులు ఉన్నారు.