పల్లె ప్రగత ’తో దేశానికే ఆదర్శంగాతెలంగాణ పల్లెలు
పల్లె ప్రగత ’తో దేశానికే ఆదర్శంగా
– రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. మార్చి 27.(జనంసాక్షి) పల్లెప్రగతి కార్యక్రమం తో దేశానికే దిక్సూచిగాతెలంగాణ పల్లెలు వెలుగొందుతున్నాయని రాష్ట్ర మున్సిపల్ , ఐటి, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.సోమవారం నిర్వహించినదీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ లో భాగంగా జాతీయ పంచాయితీ అవార్డ్ -2023 కార్యక్రమంలో భాగంగా 9 కేటగిరీల్లో మొదటి మూడు స్థానాల్లో ఉత్తమంగా నిలిచిన జిల్లాలో నీ 27 గ్రామ పంచాయతీల సర్పంచులకు సంబంధిత ఎంపీపీ, జెడ్పీటీసీ సమక్షంలో మంత్రి ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని అన్నారు.కొత్త పంచాయితీ రాజ్ చట్టం తెచ్చి గ్రామ పంచాయితీ విధులు, నిధులు, బాధ్యతలు పారిశుధ్య నిర్వహణ,పచ్చదనం , ఆహ్లాదకర వాతావరణం పెంపొందించేందుకు పెద్ద పీట వేశామన్నారు.పల్లె ప్రగ తి కార్యక్రమం వల్ల గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, మొక్కల పెంపకం, తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం వంటి పనుల వల్ల గ్రామాల రూపురేఖలే మారాయన్నారు.సర్పంచులు, అధికారులు సమష్టిగా కృషిచేయడం వల్లనే మంచి ఫలితాలు వస్తున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో 20 ఉత్తమ గ్రామపంచాయతీలను ప్రకటిస్తే అందులో 19 పంచాయతీలు తెలంగాణ రాష్ట్రానికి చెందినవి కావడం గర్వకారణమ న్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజా పరిషత్ కు రెండు సార్లు ఉత్తమ జడ్పిగా అవార్డుకు ఎంపికైందన్నారు. 25 గ్రామపంచాయతీలు 13 మండలాలు ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లా స్వచ్ఛ సర్వేక్షన్ లో వరుసగా మూడుసార్లు ఫోర్ స్టార్ రేటింతో తో దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. క్షేత్ర స్థాయిలో అధికారులు, ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. జిల్లా కలెక్టర్, డిపిఓ, జెడ్ పి సీఈఓ తో పాటు అందరూ క్షేత్ర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు.
ఈ నెలాఖరులోపు 1300 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేస్తాం
తెలంగాణ గ్రామ పంచాయితీల కు పల్లె ప్రగతి, సిడి పి గ్రాంట్ ల క్రింద 1 కోటి రూపాయల లోపు ఉన్న బకాయిలు 1300 కోట్ల ను ఈ నెలాఖరులోగా విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ విషయం పై ఆర్థిక శాఖ మంత్రి తో కూడ మాట్లాడాడని చెప్పారు .తెలంగాణ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా క్రియాశీలకంగా పనిచేస్తే ద్విగుణీకృత ఉత్సాహంతో క్షేత్రస్థాయిలో మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రానికి ఉపాధి హామీ పథకంలో రావాల్సిన 1200 కోట్ల రూపాయల బకాయిలను రాకుండా చేస్తుందని ఆరోపించారు. ప్రతి సంవత్సరం కేటాయింపులను తగ్గిస్తుంది అన్నారు.స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల భాగస్వామ్యంతో భవిష్యత్తులో రాజన్న సిరిసిల్ల జిల్లాను గ్రామీణ అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామని మంత్రి అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ అనురాగ్ జయంతి.రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్, జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్, రసమయి బాలకిషన్,ఎమ్మెల్సీ రమణ, సారయ్య, ఎమ్మెల్యే లు చెన్నమనేని రమేష్ బాబు, సుంకే రవి శంకర్, అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు,సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, ఆర్డీఓ టి శ్రీనివాస్ రావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.