Wednesday, 4 November 2026

పవన్‌కో రూల్‌.. నాకో రూలా?

– గత పదేళ్లుగా తనపై వస్తున్న విమర్శలపై ఎందుకు స్పందించలేదు
– పవన్‌ ఫ్యాన్స్‌పై రేణూ దేశాయ్‌ ఆగ్రహం
హైదరాబాద్‌, జులై6(జ‌నం సాక్షి) : గత ఐదేళ్లుగా తనపై వస్తున్న విమర్శలపై ఎందుకు స్పందించలేదని నటి రేణూ దేశాయ్‌ పవన్‌ ఫ్యాన్స్‌ను ప్రశ్నించారు. ఈ విషయంలో పవన్‌కో రూల్‌.. నాకో రూలా? అని  తన ఫేస్‌బుక్‌ పేజీలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లుగా అనరాని మాటలంటూ తన పై విమర్శలు చేసిన వారిని పట్టించుకోవద్దనీ కొందరూ సలహా ఇచ్చారని, ఇంకొందరేమో పాపులారిటీ కోసమే ఇలా చేస్తున్నానన్నారు. ఇప్పుడేమో ఓ వ్యక్తి తను పవన్‌కు వ్యతిరేకంగా మాట్లాడినట్లు ఫొటోలను సోషల్‌ విూడియాలో వైరల్‌ చేస్తున్నాడు. దీంతో కొందరు అభిమానులు పవన్‌ కల్యాణ్‌కు మద్దతివ్వాలని మర్యాదపూర్వకంగా అడుగుతుంటే.. మరికొందరు బెదిరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
‘గత ఐదేళ్లుగా కొందరు నన్ను నోటికొచ్చినట్లు తిడుతున్నప్పుడు నా ఆత్మాభిమానం విూకు ముఖ్యం అనిపించలేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు పవన్‌ పేరుకు మచ్చ వస్తుందన్న భయంతో తనని స్పందించమనడం ఎంతవరకు సబమని అభిమానులను ఉద్దేశించి ఆమె కామెంట్‌ చేశారు. తానెప్పుడూ పవన్‌ గురించి తప్పుగా మాట్లాడలేదని, అలా మాట్లాడమని తనని కానీ, తన పిల్లలను కానీ ఏ రాజకీయ పార్టీ ప్రేరేపించలేదు అని ఆమె స్పష్టం చేశారు. పవన్‌ అభిమానులు కొంత సమన్వయంతో వ్యవహరించటం మంచిదని హెచ్చరించారు.