గుంటూరు : ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగింది. వారం రోజుల చిన్నారిపై ఎలుకలు దాడి చేశాయి. దీనితో ఆ పసికందు ముఖం, కాలుపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చిన్నారి పరిస్థితి విషమంగా మారింది. చికిత్స పొందుతూ పసికందు కన్నుమూశాడు.
వివరాల్లోకి వెళ్తే….రెండు రోజుల క్రితం ఓ మహిళ ప్రసవ వేదనతో జీజీహెచ్లో చేరింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఆ పసికందును ఎలుకలు పీక్కుతిన్నాయి. రోజుల పసికందు కావడంతో ఆ బాధకు గుక్కపట్టి ఏడ్చాడు. ఏడుపును విని నిద్రలేచిన తల్లి ఎలుకలు బిడ్డను కొరుక్కుతినడం గమనించింది. వెంటనే ఆ బాబును వైద్యుల వద్దకు తీసుకెళ్ళింది. బాబు మృతి చెందండంపై కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందని కన్నెర్ర చేశారు. మరోవైపు ఆస్పత్రిలో ఎలుకలపై ఆరోగ్యశాఖ ఆరా తీస్తోంది.




