కాఫీ, రబ్బర్ బోర్డుల్లాగే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలన్నారు టీయారెస్ ఎంపీ కవిత. లోక్‌సభలో జీరో అవర్‌లో మాట్లాడిన ఆమె.. పసుపుకు దేశంలోనే గాక విదేశాల్లో కూడా బాగా డిమాండ్ ఉందన్నారు. ఐతే ప్రభుత్వం కనీస మద్ధతు ధర నిర్ణయించకపోవడంతో పసుపు ధరల్లో స్థిరత్వం లేక.. 4 వేల నుంచి 15 వేల రూపాయల మధ్య కదలాడుతున్నాయని చెప్పారు. పసుపుకు కనీస మద్దతు ధర కల్పించాలని కవిత కోరారు.
పసుపు బోర్డును ఏర్పాటు చేయండి





