Tuesday, 3 November 2026

పాక్‌లో ఆత్మాహుతి దాడి

2

– 56 మంది మృతి

లా¬ర్‌,మార్చి27(జనంసాక్షి):పాకిస్థాన్‌లోని లా¬ర్‌ మరోసారి రక్తమోడింది. నగరంలోని గుల్షన్‌ -ఏ-ఇక్బాల్‌ పార్క్‌లో ఉగ్రవాదులు ఆత్హాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ బ్లాస్ట్‌

లో 56 మంది మృతి చెందారు. 200 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలు ఉన్నారు.ఆదివారం కావడంతో పార్క్‌లో సరదాగా గడిపేందుకు

వచ్చిన వారికి టార్గెట్‌ చేసుకుని ఈ బ్లాస్ట్‌ చేశారు. భద్రతాసిబ్బంది, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. గుల్షన్‌-ఇ-ఇక్బాల్‌ పార్క్‌లోని వాహనాల పార్కింగ్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఎక్కడ చూసినా మృతదేహాలే..

పేలుడు జరిగిన అనంతరం పార్క్‌లో ఎక్కడ చూసినా మృతదేహాలే కనిపిస్తున్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. క్షతగాత్రుల్లో కొందరిని తాము రిక్షాలు, టాక్సీల్లో ఆస్పత్రులకు తరలించినట్లు చెప్పారు. పార్క్‌ ప్రాంతం చాలా పెద్దదని, దీనికి చాలా ప్రవేశద్వారాలు ఉన్నాయని.. భద్రత తక్కువగా ఉందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *