పాట్నా జనవరి2(జనంసాక్షి): : బీహార్ రాష్ట్రంలోని పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లింగాల నర్సింహారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ త్రిపాఠి నర్సింహారెడ్డితో ప్రమాణస్వీకారం చేయించారు. జస్టిస్ లింగాల నర్సింహారెడ్డి వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి కావడం విశేషం. గవిచర్లలోని రైతు కుటుంబంలో 1-8-1953న జన్మించిన నర్సింహారెడ్డి బాల్యం, చదువు అంతా వరంగల్లోనే జరిగింది. ఎల్ఎల్బీ పట్టా
పుచ్చుకున్న తర్వాత న్యాయవాదిగా, న్యాయశాస్త్ర అధ్యాపకుడిగా న్యాయరంగానికి ఆయన చేసిన సేవలతోపాటు ప్రతిభాపాటవాలను గుర్తించి నాటి కేంద్రప్రభుత్వం 2001 సంవత్సరంలో హైకోర్టు న్యాయమూర్తిగా నియమించింది.ప్రభుత్వం నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాజ్యాంగ స్ఫూర్తితో అనేకానేక విషయాలపై చరిత్రలో నిలిచిపోయే తీర్పులిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించే క్రమంలో నేడు పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. సరళమైన భాషలో తీర్పులు వెలువరించే జస్టిస్ నర్సింహారెడ్డి సంస్కృతంపై మంచి పట్టు కలిగిన మేధావి. ఏ విూటింగ్లో మాట్లాడినా లోకం పోకడను శ్లోకాలతో వివరించే ప్రయత్నం చేసేవారు.
జిల్లా కోర్టులో తనదైన ముద్ర..
వరంగల్ జిల్లా కోర్టుకు పెద్ద దిక్కుగా వ్యవహరించి జిల్లా న్యాయ చరిత్రలో తనదైన ముద్రను వేసుకున్నా రు. జిల్లా కోర్టు ఎదుర్కొంటున్న భవనాల సమస్యను తీర్చడం కోసం పట్టుపట్టి రూ.20కోట్ల వ్యయంతో ని ర్మించనున్న 10కోర్టుల సముదాయాన్ని జిల్లాకు వచ్చే లా కృషి చేయడమే కాకుండా త్వరితగతిన ఆ ప నులు జరిగేలా చూశారు. జిల్లాలోని అనేక మందికి న్యాయవ్యవస్థలో ఉద్యోగావకాశాలు కల్పించారు. ఎప్పటికప్పుడు జిల్లా అవసరాలు తీర్చగల మంగారి రాజేందర్(జింబో), నిమ్మ నారాయణ(తెలంగాణ జడ్జిల సంఘం అధ్యక్షులు), ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎం. వెంకటరమణలాంటి న్యాయమూర్తులను జిల్లాకు అం దజేయడంలో కృషి చేశారు.
న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సత్వరం స్పందించేవారు. ఇక జిల్లాలో తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు పోషించిన పాత్ర తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సాధనలో న్యాయవాదులు, న్యాయమూర్తులు నిర్వర్తించిన పాత్ర అమోఘమైనది. న్యాయవాదులు వీధుల్లోకి వచ్చి మాట్లాడగలిగారు. ప్రజా ఉద్యమాలను అంతం చేయడానికి కుట్రలు పన్నిన సందర్భంలో ఆ కుట్రలను బహిర్గతం చేయడం ద్వారా విశాల ప్రపంచం సానుభూతిని తెలంగాణ ఉద్యమం పాందగలిగింది. ఆనాటి రహస్య అధ్యయం న్యాయవాదులు బయటపెట్టి ఉండకపోతే తెలంగాణ రాష్ట్ర మరింత ఆలస్యం అయ్యేది కావచ్చు. మన జిల్లా కన్నబిడ్డ నర్సింహారెడ్డి భవిష్యత్తులో సుప్రీంకోర్టుకు వరకు ఎదిగి జిల్లా ఖ్యాతిని మరింత పెంచుతాడని ఆశిద్దాం.




