Monday, 2 November 2026

5 రిటైల్‌ మార్కెట్‌లో సింగిల్‌ విండోవిధానం త్వరలో విధివిధానాలు : ముఖ్యమంత్రి కెసిఆర్‌ హైదరాబాద్‌,జనవరి2(జనంసాక్షి): సింగిల్‌ విండో పారిశ్రామిక విధానం మాదిరిగా రిటైల్‌ మార్కెట్‌కు కూడా సింగిల్‌ విండో విధానాన్ని తీసుకువస్తామని త్వరలో విధివిధానాలు ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. పాలసీ రూపకల్పన కోసం రిటైల్‌ మార్కెట్‌ నిర్వహకులు, జీహెచ్‌ఎంసీ అధికారులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో త్వరలో సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సింగిల్‌విండో పారిశ్రామిక విధానం మాదిరిగానే రిటేయిల్‌ మార్కెట్‌ పాలసీ కూడా తేనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. పాలసీ రూపకల్పన కోసం రిటేయిల్‌ మార్కెట్‌ నిర్వాహకులు,జిహెచ్‌ఎంసి అధికారులు, టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, కార్మిక శాఖ అధికారులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో ఓ సంయుక్త సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. సచివాలయంలో శుక్రవారం రిటేయిల్‌ ఇండస్త్రి ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిశారు. ప్రభుత్వానకి పలు విన్నపాలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రిటేయిల్‌ మాల్స్‌ను విస్తరించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ సహకారాన్ని అభ్యర్ధించారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మాల్స్‌ ఏర్పాటు అభివృద్దికి ఓ సూచకగా ఉంటుందని వెల్లడించారు. ప్రజలకు అవసరమయ్యే వస్తవులన్నీ ఒకేచోట దొరికే వెసులుబాటు ఉండటం మంచిదని చెప్పారు. అయితే రిటేయిల్‌ మార్కెట్‌ ఎట్లబడితే అట్ల గాకుండా ఓ ప్రణాళికా బద్దంగా విస్తరించాలని ముఖ్యమంత్రి అన్నారు. రిటేయిల్‌ మార్కెట్‌ విస్తరణ కూడా నగరాలు,పట్టణాల అభివృద్దిలో భాగమేనని చెప్పారు. మాల్స్‌ ఏర్పాటు సందర్బంగా తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. పెద్ద పెద్ద కాలనీలు, అపార్టుమెంట్లు, ఇతర నివాస గృహాల సముదాయాలు నిర్మించే సందర్భంలో రిటేయిల్‌ మార్కెట్‌కు అవసరమైన స్థలాన్ని కూడా కేటాయించడం తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. వరంగల్‌,కరీంనగర్‌, లాంటి నగరాల్లో ఇప్పటికే మల్లిప్లెక్స్‌లు, రిటేయిల్‌ షాపింగ్‌ మాల్స్‌ వచ్చాయని, ఖమ్మం,రామగుండం, నిజామాబాద్‌ తదితర ప్రాంతాల్లో కూడా ఇవి విస్తరిస్తాయన్నారు. ఈ నేపధ్యంలో మాల్స్‌, రిటేయిల్‌ షాపింగ్‌ సెంటర్ల ఏర్పాటు, నిర్వహాణకు సంబంధించి ఓ విధానం తీసుకురావలసిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తిస్తున్నదని చెప్పారు. మాల్స్‌లో పనిచేసే ఉద్యోగులకు వారానికి ఒక రోజు ఖచ్చితంగా సెలవు లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాత్రి వేళల్లో విధులు నిర్వర్తించే మహిళల భద్రత కోసం చర్యలు చేపట్టాలన్నారు. రిటైల్‌ మార్కెట్‌ వ్యాపారులు ఈసందర్బంగా ముఖ్యమంత్రికి పలు విజ్ఞాపనలు చేశారు. 365 రోజులు వ్యాపారం నిర్వహించుకొనే అవకాశం కల్పించాలని, ఒకచోట లైసెన్స్‌ పొందిన సంస్థ అనుబంధ శాఖలను అదేలైసెన్స్‌పై స్థపించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. రాత్రివేళల్లో మహిళా ఉద్యోగులు పనిచేయడానికి అవకాశం కల్లపించాలన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, పరిశ్రమల శాఖ కార్యదర్శి ప్రదీప్‌ చంద్ర,లైఫ్‌ స్టైల్‌ ప్రతినిధి కబీర్‌, వాల్‌మార్ట్‌ ప్రతినిధి మురళి, షాపర్స్‌స్టాప్‌ ప్రతినిధి రవీందర్‌, బిగ్‌బజార్‌ ప్రతినిధి రాకేష్‌, రిలయన్స్‌ ప్రతినిధి వేణుగోపాల్‌, రిటేయిల్‌ ఇండస్ట్రీ అసోసియేషన్‌ ప్రతినిధులు నగేష్‌, రజనీష్‌, రాజేందర్‌, గౌతమ్‌, ఆశీష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

4 రిటైల్‌ మార్కెట్‌లో సింగిల్‌ విండోవిధానం

త్వరలో విధివిధానాలు : ముఖ్యమంత్రి కెసిఆర్‌

హైదరాబాద్‌,జనవరి2(జనంసాక్షి): సింగిల్‌ విండో పారిశ్రామిక విధానం మాదిరిగా రిటైల్‌ మార్కెట్‌కు కూడా సింగిల్‌ విండో విధానాన్ని  తీసుకువస్తామని త్వరలో విధివిధానాలు ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. పాలసీ రూపకల్పన కోసం రిటైల్‌ మార్కెట్‌ నిర్వహకులు, జీహెచ్‌ఎంసీ అధికారులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో త్వరలో సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.  సింగిల్‌విండో పారిశ్రామిక విధానం మాదిరిగానే రిటేయిల్‌ మార్కెట్‌ పాలసీ కూడా తేనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. పాలసీ రూపకల్పన కోసం రిటేయిల్‌ మార్కెట్‌ నిర్వాహకులు,జిహెచ్‌ఎంసి అధికారులు, టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, కార్మిక శాఖ అధికారులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో ఓ సంయుక్త సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. సచివాలయంలో శుక్రవారం రిటేయిల్‌ ఇండస్త్రి ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిశారు. ప్రభుత్వానకి పలు విన్నపాలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రిటేయిల్‌ మాల్స్‌ను విస్తరించనున్నట్లు చెప్పారు.  ప్రభుత్వ సహకారాన్ని అభ్యర్ధించారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మాల్స్‌ ఏర్పాటు అభివృద్దికి ఓ సూచకగా ఉంటుందని వెల్లడించారు. ప్రజలకు అవసరమయ్యే వస్తవులన్నీ ఒకేచోట దొరికే వెసులుబాటు ఉండటం మంచిదని చెప్పారు. అయితే రిటేయిల్‌ మార్కెట్‌ ఎట్లబడితే అట్ల గాకుండా ఓ ప్రణాళికా బద్దంగా విస్తరించాలని ముఖ్యమంత్రి అన్నారు. రిటేయిల్‌ మార్కెట్‌ విస్తరణ కూడా నగరాలు,పట్టణాల అభివృద్దిలో భాగమేనని చెప్పారు. మాల్స్‌ ఏర్పాటు సందర్బంగా తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. పెద్ద పెద్ద కాలనీలు, అపార్టుమెంట్లు, ఇతర నివాస గృహాల సముదాయాలు నిర్మించే సందర్భంలో రిటేయిల్‌ మార్కెట్‌కు అవసరమైన స్థలాన్ని కూడా కేటాయించడం తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. వరంగల్‌,కరీంనగర్‌, లాంటి నగరాల్లో ఇప్పటికే మల్లిప్లెక్స్‌లు, రిటేయిల్‌ షాపింగ్‌ మాల్స్‌ వచ్చాయని, ఖమ్మం,రామగుండం, నిజామాబాద్‌ తదితర ప్రాంతాల్లో కూడా ఇవి విస్తరిస్తాయన్నారు. ఈ నేపధ్యంలో మాల్స్‌, రిటేయిల్‌ షాపింగ్‌ సెంటర్ల ఏర్పాటు, నిర్వహాణకు సంబంధించి ఓ విధానం తీసుకురావలసిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తిస్తున్నదని చెప్పారు. మాల్స్‌లో పనిచేసే ఉద్యోగులకు వారానికి ఒక రోజు ఖచ్చితంగా సెలవు లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాత్రి వేళల్లో విధులు నిర్వర్తించే మహిళల భద్రత కోసం చర్యలు చేపట్టాలన్నారు.  రిటైల్‌ మార్కెట్‌ వ్యాపారులు  ఈసందర్బంగా ముఖ్యమంత్రికి పలు విజ్ఞాపనలు చేశారు. 365 రోజులు  వ్యాపారం నిర్వహించుకొనే అవకాశం కల్పించాలని, ఒకచోట లైసెన్స్‌ పొందిన సంస్థ అనుబంధ శాఖలను అదేలైసెన్స్‌పై స్థపించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. రాత్రివేళల్లో మహిళా ఉద్యోగులు పనిచేయడానికి అవకాశం కల్లపించాలన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, పరిశ్రమల శాఖ కార్యదర్శి ప్రదీప్‌ చంద్ర,లైఫ్‌ స్టైల్‌ ప్రతినిధి కబీర్‌, వాల్‌మార్ట్‌ ప్రతినిధి మురళి, షాపర్స్‌స్టాప్‌ ప్రతినిధి రవీందర్‌, బిగ్‌బజార్‌ ప్రతినిధి రాకేష్‌, రిలయన్స్‌ ప్రతినిధి వేణుగోపాల్‌, రిటేయిల్‌ ఇండస్ట్రీ అసోసియేషన్‌ ప్రతినిధులు నగేష్‌, రజనీష్‌, రాజేందర్‌, గౌతమ్‌, ఆశీష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *