పాఠశాలలకు గ్రామ పంచాయతీ పాలక వర్గం ఆధ్వర్యంలో బెంచీలు అందజేత. దుబ్బాక 13,జూన్ ( జనం సాక్షి )

సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని రామక్కపేట గ్రామంలో సోమవారం నాడు పాఠశాలలు పున:ప్రారంభంను పురస్కరించుకుని గ్రామ పంచాయతీ పాలక వర్గం ఆధ్వర్యంలో బడి బాట కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 8బెంచీలు,2 ప్రాథమిక పాఠశాలలో రెండేసి చొప్పున బెంచీలను ఉపాధ్యాయులు బృందాల సమక్షంలో అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చింతల పద్మ ప్రభాకర్,ఎంపీటీసీ సంగెపు శోభ స్వామి,గ్రామ పంచాయతీ కార్యదర్శి రమ్య,వార్డ్ మెంబర్లు పెంబర్తి బాలకిషన్,చౌకి సువర్ణ, పలువురు వార్డ్ మెంబర్లు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.