Friday, 6 November 2026

పాత‌బస్తీలో రంజాన్‌ సందడి

జోరుగా షాపింగ్‌ చేస్తున్న ప్రజలు

రాత్రిపూట వెలుగులో షాపింగ్‌ మజా

హైదరాబాద్‌,జూన్‌15(జ‌నం సాక్షి ): ముస్లిం సోదరులు రంజాన్‌ పర్వదినం శుక్రవారమే అవుతుందన్న భరోసాతో షాపింగ్‌ చేపట్టడంతో హైదరాబాద్‌ మార్కెట్లు కళకలలాడా,ఇ గురువారం అర్థరాత్రి వకూ దీపాల వెలుగులో పాతబస్తీ పులకించింది. పండుగ శనివారం కావడంతో షాపింగ్‌ చేసుకోవడానికి ముస్లింలకు మరోరోజు లభించింది. గురువారం అర్ధరాత్రి దాటాక నగరంలో మార్కెట్లు జనంరద్దీతో కిటకిటలాడాయి.గురువారం ఆకాశాన నెలవంక దర్శనం కాలేదు. శుక్రవారం నాటికి 30 ఉపవాసాలు పూర్తి కానుండడంతో మరుసటి రోజు అంటే శనివారం తప్పనిసరిగా రంజాన్‌ పండుగకు జరుపుకోవాలని రుహితె హిలాల్‌ కమిటీ ప్రకటించింది. దీంతో శనివారం రంజాన్‌ పండుగ జరుపుకోనున్నారు. పండుగకు ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉండడంతో చార్మినార్‌ పరిసరాలలో బట్టలు, చెప్పులు ఇతర వస్తువులు చౌకగా లభిస్తుండడంతో ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. దీంతో పాతబస్తీలోని మార్కెట్లన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. రంజాన్‌ కొనుగోళ్లు చివరి దశకు చేరుకోవడంతో క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. వ్యాపారులు కొనుగోలుదారులను ఆకర్శించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. రంజాన్‌ పండుగ సందడితో ముస్లిం సోదరుల కొనుగోళ్ళతో చార్మినార్‌ పరిసరాలు కిక్కిరిసిపోతున్నాయి. పాతబస్తీలోని ప్రతి బస్తీ, ప్రతి వాడలో ఇదే పరిస్థితి. అఫ్జల్‌గంజ్‌ నుంచి బార్కస్‌ వరకు ప్రధాన రహదారులలో ఉండే దుకాణాలే కాకుండా గల్లీల్లో ఉండే చిన్నచిన్న దుకాణాలు కూడా రద్దీగానే మారుతున్నాయి. రాత్రి 10 గంటల నుంచి ఇంకా ఎక్కువగా కొనుగోళ్ళు పెరుగుతుండడం, తెల్లవారుజామున 4గంటల సమయంలో కూడా దుకాణాలు కొనుగోలుదారులతో కిక్కిరిసి ఉండడం విశేషం. సహజంగా పాతబస్తీలో ప్రజల అలవాట్లు, సంస్కృతి విభిన్నంగా ఉంటుంది. పెళ్ళిళ్లు, శుభకార్యాలు, షాపింగ్‌లు ఏవైనాసరే ఇక్కడ రాత్రిపూటే మొదలవుతాయి. ఇది తరతరాలుగా వస్తున్న పాతబస్తీ సంస్కృతి. పురుషులు పగటిపూట ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకొని సాయంత్రం ఇంటికి చేరుకుంటాయి. మహిళలు పగలు ఇంటి పనులు చూసుకొని సాయంత్రం ఇఫ్తార్‌ ముగించుకుని తీరిగ్గా షాపింగ్‌కు బయలుదేరి తెల్లవారుజాము వరకు తమకు కావాల్సిన వస్తువులుకొనుగోలు చేసుకుంటారు. రాత్రిపూట షాపింగ్‌ మధురానుభూతులను మిగులుస్తుందని చెబుతారు.పండుగకు ధరించే వస్త్రాలతోపాటు, పాదరక్షలు, అత్తర్లు, పండుగ రోజు తయారు చేసే సేమియా, డ్రైఫ్రూట్స్‌, పండుగ పూట ఇంటికి వచ్చే అతిథుల మనసును గెల్చుకునేందుకు అందమైన గృహాలంకరణ వస్తువుల కొనుగోళ్ళు జోరుగా సాగుతున్నాయి. పాతబస్తీనుంచే కాకుండా నగరం నలుమూలల నుంచి కొనుగోలుదారులు తరలివస్తుండడంతో చార్మినార్‌ పరిసర ప్రాంతాలన్నీ ఇసుక వేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోతున్నాయి. మధ్యాహ్నం 11 గంటల నుంచి తెల్లవారుజాము వరకు దుకాణాలన్నీ తెరిచే వుంటున్నాయి. చార్మినార్‌, లాడ్‌బజార్‌, మదీన, గుల్జార్‌హౌజ్‌లలోని వందలాది షోరూమ్‌లలో అన్నిరకాల వస్తువులు లభ్యమవుతున్నాయి. దీంతో అన్నిరకాల దుకాణాలు కొనుగోలుదారులతో కిక్కిరిసి కనిపిస్తు న్నాయి. చార్మినార్‌ పరిసరాలలో అడుగడుగునా తాత్కాలిక దుకాణాలు వెలిశాయి. మామూలు రోజుల్లో ఇతర వ్యాపారాలు చేసుకునేవారు కూడా రంజాన్‌ మాసంలో రోడ్డు పక్కన రెండు టేబుళ్ళు వేసుకొని ఏదో ఒక వస్తువును అమ్ముతున్నారు.