పాదులు చేసి ఫెన్సింగ్ చేయాలి
ప్రతి మొక్క చుట్టు పాదులు చేసి బయో ఫెన్సింగ్ చేయాలనీ దోమ సర్పంచ్ కె రాజిరెడ్డి ఉపాధి కూలీలకు సూచించారు బుధవారం దోమ గ్రామ సమీపంలో ఉపాధి కూలీలు చేస్తున్న బయో ఫెన్సింగ్ పనులను పరిశీలించారు ప్రతి మొక్కకు పాదులు చేయడం ద్వారా మొక్క చుట్టు ఉన్న గడ్డిని తీసివేయడం తో పాటు మొక్కచుట్టు నీరు కొంత సేపు నిల్వ ఉండడానికి పాదులు ఉపయోగ పడుతాయని చెప్పారు