Monday, 2 November 2026

పాన్‌తో ఆధార్ లింక్‌.. ఇవాళే ఆఖ‌రి తేది..

పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్‌)తో ఆధార్‌ అనుసంధానం గడువును పొడిగించే విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం(ఆగస్టు-31) నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుత గడువు నేటి (ఆగస్టు 31)తో ముగుస్తోంది. దీన్ని ఈ ఏడాది చివరి వరకూ పొడిగించే అవకాశముంది. ప్రస్తుతం ‘‘ఆధార్‌ అనుసంధానం’’ అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై నవంబరులో విచారణ చేపడతామని సుప్రీం ఇప్పటికే ప్రకటించింది. ఐటి రిటర్న్స్‌ దాఖలు చేసి ఆధార్‌కార్డ్‌ అనుసంధానం చేయలేదా.. అయితే మీరు దాఖలు చేయనట్లే లెక్కని కేంద్ర తేల్చిచెప్పింది. ఐటీఆర్‌ దాఖలు చేయడంతోపాటు ఆధార్‌ కూడా కీలకంగా మారింది. ఎక్కువ మందిలో ఆధార్‌ లింక్‌ చేయకపోతే ఏమవుతుంది..?

1.ఐటీఆర్‌ దాఖలుచేసి ఆధార్‌ అనుసంధానం చేయకపోతే దాన్ని ఐటీ శాఖ పరిగణనలోకి తీసుకోదు. పైగా ఐటీఆర్‌ దాఖలు చేయని వారి జాబితాలో వీరిని చేర్చుతారు

2.అలాంటి వారికి ఐటీఆర్‌ సెక్షన్‌ 142(1) ప్రకారం నోటీసులు జారీ చేస్తారు. దానికి రూ.5వేలు ఫెనాల్టీ వేస్తారు

3.ఆదాయపన్నుతో చేసుకునే క్లైములను చేసుకోలేరు. నష్టాలు, పెట్టుబడి, బిజినెస్‌ నష్టాలను క్యారీ ఫార్వడ్‌ చేసుకోలేరు.

4.ఎవైనా రింఫండ్స్‌ వచ్చేవి ఉంటే వాటిని మంజూరు చేయరు

5.కొన్ని క్యాటగిరీ వారికి వెసుబాటు ఉంటుంది

6.ఎన్నారైలు, 80 ఏళ్లకు పైబడిన వారు, అస్సాం, మేఘాలయ, జమ్ము కశ్మీర్‌ ప్రజలకు కొంత వెసులు బాటు ఉంటుంది.