పాయకరావుపేటలో దారుణం
పవన్ కోసం ఫ్లెక్సీలు కడుతుండగా ఇద్దరు దుర్మరణం
విశాఖపట్టణం,జూన్6(జనం సాక్షి): విశాఖ జిల్లా పాయకరావుపేటలో దారుణం జరిగింది. పవన్ కళ్యాణ్ సభ కోసం ప్లెక్సీలు కడుతుండగా విద్యుద్ఘాతంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ గురువారం పాయకరావుపేట రానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు మంగళవారం అర్ధరాత్రి దాటాక పాయకరావుపేట ప్రధాన రహదారి పక్కన భవనంపై ప్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే 33కేవీ విద్యుత్ తీగలకు ప్లెక్సీ ఇనుప రాడ్స్ తగిలి టి.నాగరాజు(28), భీమవరపు శివ(31) అక్కడికక్కడే మృతిచెందారు. శివ పాయకరావుపేట వాసి కాగా.. నాగరాజు స్వస్థలం తుని. ఈ ఘటనపై ఎస్‌ఐ ఎల్.రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.