Tuesday, 3 November 2026

పార్టీ అధ్యక్ష్య పదవికి కేజ్రివాల్ రాజీనామా

ఢిల్లీ:ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ పార్టీ అధ్యక్ష్య పదవికి రాజీనామా చేశారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ వార్త ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో చర్చానీయాంశంగా మారింది. గత గురువారం జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలోనే అరవింద్ కేజ్రివాల్ తన రాజీనామాను సమర్పించినట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడుగా ఉంటున్న కేజ్రివాల్, ఢిల్లీ ముఖ్యమంత్రిగా కూడా ఉంటూ రెండు పదవులు అనుభవిస్తున్నాడని పార్టీలో కొందరు విమర్శలు చేసినట్లు తెలుస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని విమర్శలకు తావు ఇవ్వకుండా కేజ్రివాల్ తన రాజీనామాను ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే పార్టీ కార్యవర్గ సభ్యులు అందరూ ఆయన రాజీనామాను తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *