హైదరాబాద్ : టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. పార్టీ ఫిరాయించి టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలు తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్పీకర్ మధుసూధనచారిని కలిసిన అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అలాగే రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పార్టీ ప్లీనరీ, బహిరంగ సభలలో పాల్గొనడం నిబంధనలకు విరుద్దమన్నారు. అలాగే కడియం శ్రీహరి కూడా రెండు పదవులు అనుభవించడంపై స్పీకర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.




