Monday, 2 November 2026

పార్టీ సభ్యత్వ నమోదు అమోఘం

ప్రజలంతా కెసిఆర్‌ వెన్నంటి ఉన్నారు
త్వరలో నియోజకవర్గ స్థాయి సమావేశాలు
త్వరగా కమిటీలు పూర్తి చేయాలి
పార్టీ ప్రధాన కార్యదర్శలతో భేటీలో కెటిఆర్‌
హైదరాబాద్‌,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  పార్టీ సభ్యత్వ నమోదు జరిగిన తీరుపై  టిఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రామారావు సంతృప్టిని వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్‌ తిరుగులేని పార్టీ అన్నారు. కెసిఆర్‌ పట్ల ప్రజల్లో అచంచలమైన వివ్వాసం ఉందనడానికి పార్టీ సభ్యత్వ నమోదు కూడా కారణమన్నారు. ప్రజలు అభివృద్దిని కోరుకుంటున్నారని, అందుకే ప్రతి ఎన్నికల్లోనూ గులాబీ బాస్‌ వెంట నడుస్తున్నారని అన్నారు.
తెలంగాణ భవన్‌ లో పార్టీ ప్రధాన కార్యదర్శులతో కెటిఆర్‌  సమావేశమయ్యారు.  త్వరలో నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహిస్తామని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. పార్టీ కార్యాలయాల పురోగతిపై కేటీఆర్‌ సవిూక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తయిన నేపథ్యంలో కమిటీల ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు.ఇప్పటికే కమిటీల ఏర్పాటు దాదాపు పూర్తయిందని ప్రధాన కార్యదర్శులు తెలిపారు. ఈ నెల 31 నాటికి అన్ని కమిటీలను ఏర్పాటు చేసి సెప్టెంబర్‌ 1వ తేదీ నాటికి పూర్తిస్థాయి నివేదిక పార్టీకి ఇవ్వాలని కేటీఆర్‌ కోరారు. పార్టీ సభ్యత్వ నమోదు తోపాటు కమిటీల నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా నియోజకవర్గ స్థాయి సమావేశాలను ఏర్పాటు చేసుకోవాలని, ఈ మేరకు ఆయా సమావేశాల తేదీలను సైతం పార్టీకి అందజేయాలని  తెలిపారు.  ఈనెల 31 నాటికి అన్ని కమిటీలను ఏర్పాటు చేసి సెప్టెంబర్‌ 1 నాటికి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని సూచించారు. త్వరలోనే నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. అదేవిధంగా జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణ పనుల పురోగతిపై కేటీఆర్‌ సవిూక్ష జరిపారు.