పార్థసారిథి ఎన్నికల అఫిడవిట్ కేసు విచారణ జరుగుతోంది
విజయవాడ: మంత్రి పార్థసారిథి ఎన్నికల అఫిడవిట్ కేసు విచారణ కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ తెలియజేశారు. ఫెరా కేసు వివరాలు అఫిడవిట్‌లో లేకపోతే సెక్షన్ 125 (ఎ) ప్రకారం కోర్టుకు వెళ్తామని ఆయన అన్నారు. ఈ రోజు ఆయన కృష్ణా జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.