Tuesday, 3 November 2026

పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం

. 6
జనవరి ఒకటిన సెలవు

క్రైస్తవ భవనానికి 10 కోట్లు మంజూరీకి కేబినెట్‌ ఆమోదం

హైదరాబాద్‌,డిసెంబర్‌19(జనంసాక్షి): కొత్తగా నియమించిన పార్లమెంటరీ కార్యదర్శుల నియమాక ఆర్డినెన్స్‌కు తెలంగాణ కేబినేట్‌ ఆమోదం తెలిపింది. దీనికి అడ్డంకులుఏర్పడడంతో కేబినేట్‌ ఆమోదించింది. సిఎం కెసిఆర్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గ భేటీ ముగిసింది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలకు ఆమోద ముద్ర వేశారు.  జనవరి 1న సెలవు దినంగా మంత్రివర్గం ఆమోదించింది. జనవరి 1కి బదులుగా ఆ నెలలోని రెండో శనివారం పనిదినంగా భావించాలని పేర్కొంది. గ్రామపంచాయతీల్లో వివాహాల నమోదు చట్టానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కైస్త్రవ భవన నిర్మాణానికి రూ. 10 కోట్ల మంజూరు ఆమోదం తెలిపింది. వరంగల్‌లో నిర్మించ తలపెట్టిన కాళోజీ నారాయణరావు యూనివర్సటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ నెల 16న మంత్రివర్గ విస్తరణ సందర్భంగా కేబినేట్‌ సమావేశం జరిగినా పలు అంవాలపై చర్చలేకపోయింది. అయితే తిరిగి శుక్రవారం తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన పలు అంశాలను చర్చించింది. నామినేటెడ్‌ పోస్టుల భర్తీ, రాచకొండ అభివృద్ధి, పార్లమెంటరీ కార్యదర్శులు, కార్పొరేషన్ల విభజనపై కూడా మంత్రివర్గం చర్చించినట్లు   సమాచారం. ఇదిలావుంటే ఎస్‌ఆర్‌ నగర్‌లోని మాజీ స్పీకర్‌ రామచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళిన సిఎం కెసిఆర్‌ ఆయనను పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను సిఎం కెసిఆర్‌  పరామర్శించారు. సిఎంతో పాటు మంత్రులు రాజయ్య,నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఉన్నారు. సీఎం కేసీఆర్‌ తన ఇంటికి వచ్చి పరామర్శించినందుకు రామచంద్రారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి పనులు అభినందనీయమని రామచంద్రారెడ్డి కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *