Tuesday, 3 November 2026

రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

5

హైదరాబాద్‌,డిసెంబర్‌19(జనంసాక్షి):  ప్రముఖ తెలుగు రచయిత, విమర్శకుడు రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డికి  కేంద్ర సాహిత్య అకాడవిూ పురస్కారం లభించింది. కడప జిల్లాకు చెందిన చంద్రశేఖర్‌రెడ్డికి ‘మన నవలలు- మన కథానికలు’ అనే పుస్తకానికి ఉత్తమ విమర్శకుడిగా ఈ పురస్కారం లభించింది. రాయలసీమ సాహిత్యోద్యమాల చరిత్ర, దళిత కథలు, ఆధునికాంధ్ర కవిత్వం, గురజాడ కథానికలు తదితర రచనలను ఆయన వెలువరించారు.తాను ఎదురు చూడని పురస్కారమిదని, చాలా ఆనందంగా ఉందని  రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. కేంద్రసాహిత్య అకాడవిూ పురస్కారం లభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ స్థాయిలోనే ఇది అత్యున్నత పురస్కారమని, ఈ పురస్కారంతో తన బాధ్యత మరింత పెరిగిందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో రాయలసీమ రచనలపై మరింతగా కృషి చేస్తానని ఆయన చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *