కొన్నిచోట్ల మార్పులు తప్పవన్న సంకేతాలు
నాలుగైదు నియోజకవర్గాల్లో కొత్తవారికి ఛాన్స్?
హైదరాబాద్,మార్చి11(జనంసాక్షి): ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన టీఆర్‌ఎస్.. అదే జోరుతో ఇప్పుడు పార్లమెంట్‌ఎన్నికల్లో అడుగులు వేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ఎమ్మెల్యేలు సైతం గులాబీ పార్టీలో చేరాలని నిర్ణయించిన విషయం తెల్సిందే. సీఎం కేసీఆర్ చేపడుతున్న ప్రజోపయోగ కార్యక్రమాలకు అండగా ఉండాలని స్వచ్ఛందంగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. ఇక టీఆర్‌ఎస్ తన లోక్‌సభ ఎన్నికల లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశిరచుకున్నది. 16 లోక్‌సభ స్థానాలను గెల్చుకోవడానికి ఇప్పటికే వ్యూహాన్ని రచించింది. ఇందులో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్లమెంట్ నియోజకవర్గాల పర్యటనకు శ్రీకారంచుట్టారు.
పార్లమెంట్ నియోజకవర్గాలస్థాయి సన్నాహక సమావేశాలను ఏర్పాటుచేశారు. సమావేశాలకు పార్టీ శ్రేణుల నుంచి అనూహ్యస్పందన వస్తున్నది. ఒక్కొక్క నియోజకవర్గంలో 30 వేలకు తక్కువ కాకుండా కార్యకర్తలు హాజరవుతున్నారు. ఇక అభ్యర్థుల ఎంపిక పక్రియపై సీఎం కేసీఆర్ పూర్తిగా దృష్టిసారించారు. ఇప్పటికే కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక పక్రియ పూర్తయ్యింది. ఒకట్రెండు రోజుల్లోనే అన్ని లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నారు. పాతకొత్తల మేలుకలయికగా టీఆర్‌ఎస్ లోక్‌సభ జాబితా ఉండే అవకాశం ఉన్నది. గతంలో ఎంపీలుగా పనిచేసిన బాల్క సుమన్, చామకూర మల్లారెడ్డి వంటివారు ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో ఏర్పడ్డ ఖాళీలను కొత్తవారితో నింపనున్నారు. ఆ కొత్త వారు ఎవరన్నది తేలాల్సి ఉంది. ఇకపోతే సిట్టింగ్‌లందరికి టిక్కెట్లు దక్కుతాయా అన్నది కూడా అనుమానమే. టీఆర్‌ఎస్‌కు 16 స్థానాలను గెల్చుకోవడం లక్ష్యంగా సాగుతున్న వేళ కొందరు కొత్తవారికి మళ్లీ టిక్కెట్లు ఇవ్వనున్నారని సమాచారం, అందుకే ఈసారి నియోజకవర్గాలవారీగా మెజార్టీ పెంచుకోవడంపై దృష్టిసారించారు. అన్ని నియోజకవర్గాల్లో మెజార్టీని పెంచుకోవడం, ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్లు గల్లంతు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగనున్నారు. ఇందులో భాగంగా మల్కాజిగిరి నుంచి మాజీ ఎంపి, ప్రస్తుత ఢిల్లీ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారిని రంగం/-లోకి దింపుతారన్నప్రచారం సాగుతోంది. ఇక్కడ అత్యధికంగా ఉన్న బ్రాహ్మణ ఓట్లను గంపగుత్తగా వేయించుకునే క్రమంలో కెసిఆర్ ఈ ఎత్తు వేశారని అంటున్నారు. ఇకపోతే వరంగల్ నుంచి మరోమారు కడియం శ్రీహరిని బరిలోకి దింపే ఛాన్సెస్ ఉన్నాయి.
దేశ రాజకీయాల్లో బలమైన ప్రాంతీయ పార్టీగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన టీఆర్‌ఎస్.. ఇప్పుడు జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో సత్తాచాటడం ద్వారా దేశ రాజకీయాల్లో అడుగుపెట్టాలని చూస్తోంది. ఆదివారం ఎన్నికల నగారా మోగడంతో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ప్రధాన చర్చ భవిష్యత్ ఫెడరల్ ఫ్రంట్‌పైనే. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో విజయఢంకా మోగించి ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలకు రెట్టించిన ఉత్సాహంతో టీఆర్‌ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. శాసనసభ ఎన్నికల్లో 119 స్థానాలకుగాను 88 నియోజకవర్గాల్లో విజయం సాధించిన టీఆర్‌ఎస్.. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న 17 లోక్‌సభ స్థానాలకుగాను 16 నియోజకవర్గాలను కైవసం చేసుకునేందుకు సన్నద్ధమైంది. అత్యంత సునాయసంగా గెల్చుకోవాలని చూస్తోంది. మిగిలిన ఒక్క స్థానాన్ని కూడా మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం గెల్చుకోనున్నది. దీంతో టీఆర్‌ఎస్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్నది లక్ష్యం. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీ, కాంగ్రెస్‌కు పూర్తిస్థాయిలో మెజార్టీ సీట్లు వచ్చే అవకాశం లేదని సర్వేలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలే కీలకపాత్ర పోషించనున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న అనేక ప్రాంతీయ పార్టీలతో టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇప్పటికే చర్చలు జరిపారు. అనేక మంది హేమాహేవిూ నేతలు సీఎం కేసీఆర్ ఆలోచనలతో ఏకీభవించారు. కలిసివచ్చేందుకు ఆసక్తిచూపారు. ఈ దశలో 16 సీట్లు లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అభ్యర్థుల ఎంపికలో కూడా వైవిధ్యం కనబర్చనున్నారు. ఆదిలాబాద్‌లో గోడం నగేశ్‌కు ఈసారి టిక్కెట్ కష్టమనే భావన ఉంది. ఖమ్మంలో కూడా పొంగులేటి బదులు కుల సవిూకరణాల నేపథ్యంలో తుమ్మలను బరిలోకి దింపుతారని భావిస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక




