Monday, 2 November 2026

పాలనలో ప్రణాళికశాఖ పాత్ర కీలకం

గణాంక పుస్తక అవిష్కరణలో వినోద్‌
హైదరాబాద్‌,అక్టోబర్‌27(జ‌నంసాక్షి):  ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రణాళికా శాఖ పాత్ర కీలకమని ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం గణాంక భవన్‌లో తెలంగాణ స్టాటిస్టికల్‌ అబ్‌ స్టాక్ట్‌ పుస్తకాన్ని రాష్ట్ర ఆర్ధిక, ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి కే. రామకృష్ణారావుతో కలిసి ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. జీఎస్డీపీ అంచనాలు, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, పలు సర్వేల గణాంకాలు, ప్రభుత్వం సాధించిన ప్రగతి తదితర వివరాలు ఈ పుస్తకంలో పొందుపర్చామని తెలిపారు. రాష్ట్ర సమగ్ర కార్యాచరణ సమాచారాన్ని క్రోడీకరించి పుస్తక రూపంలో తీసుకురావడం గొప్ప విషయమన్నారు. సమాచారం కోసం ఠబిబూ://బిబటూబ.బి|్గ/జీనిణజీనిజీ.ణనీల.తిని వెబ్‌సైట్‌లో చూడాలని కోరారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు విధిగా ఈ వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోవాలని, ఆయా సమావేశాల్లో గణాంకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. గ్రామస్థాయి సమాచారంతో ప్రత్యేకంగా పుస్తకాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రోడ్‌ అట్లాస్‌పై దృష్టిని సారించాలని సూచించారు. రాష్ట్ర ఆర్ధిక, ప్రణాళిక శాఖల ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ..  అన్ని ప్రభుత్వశాఖలకు ఉపయోగపడేలా సమగ్ర గణాంకాలతో పుస్తకాన్ని ప్రచురించినట్లు తెలిపారు. త్వరలో గ్రామస్థాయి సమాచారంతో పుస్తకాన్ని తీసుకుని రానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డెవలప్‌మెంట్‌ ఎ/-లానింగ్‌ సొసైటీ ( టీఎస్‌డీపీఎస్‌) సీఈఓ. జి. దయానంద్‌, రాష్ట్ర రిమోట్‌ సెన్సింగ్‌ శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ శ్రీనివాస్‌ రెడ్డి, సిజిస్‌ సంస్థ ప్రతినిధి రాజేంద్ర పాల్గొన్నారు.