పాలస్తీనా స్వతంత్ర రాజ్యంగా ఉండాలి

` ఇదే భారత్‌ చిరకాల స్థిరమైన వైఖరి
` ఇరు దేశాల చర్చల ద్వారా శాంతి సాధించాలి
` భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి
ఢల్లీి(జనంసాక్షి):ఇజ్రాయెల్‌ ` హమాస్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. పాలస్తీనా స్వతంత్ర దేశంగా గుర్తింపు పొందడాన్ని భారత్‌ సమర్థిస్తుందని తెలిపింది.ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి గురువారం పాలస్తీనాపై భారత్‌ వైఖరిని స్పష్టం చేశారు. ‘’ఇజ్రాయెల్‌ ` పాలస్తీనా విషయంలో భారత్‌ వైఖరి చాలా కాలంగా స్థిరంగా ఉంది. ఇజ్రాయెల్‌తో శాంతియుతంగా చర్చలు జరిపి.. గుర్తింపు పొందిన సరిహద్దుల్లో నివసిస్తూ.. సార్వభౌమాధికారం, పూర్తి స్వతంత్రతతో వ్యవహరించే పాలస్తీనా ఏర్పాటును భారత్‌ ఎల్లప్పుడూ సమర్థిస్తుంది. ఇందుకోసం పాలస్తీనా, ఇజ్రాయెల్‌లు నేరుగా సంప్రదింపులు జరపాలని భారత్‌ ఆశిస్తోంది’’అని బాగ్చీ తెలిపారు.ఇజ్రాయెల్‌, గాజాలో మానవతా పరిస్థితులపై స్పందిస్తూ.. ఇరు వర్గాలు అంతర్జాతీయ మానవతా చట్టాలను పాటించాలన్నారు. అదే సమయంలో ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించకూడదని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌కు భారత్‌ ఆయుధపరంగా సాయం అందిస్తోందా? అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు .. ప్రస్తుతం ఆ దేశంలో ఉన్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడంపైనే దృష్టి సారించినట్లు తెలిపారు. ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్రం ఆపరేషన్‌ అజయ్‌ ను ప్రకటించింది.
పశ్చిమాసియా శాంతి చర్చల పునరుద్ధరణకు రష్యా, చైనాల పిలుపు
ఇజ్రాయిల్‌ పైన పాలస్తీనా మిలిటెంట్‌ గ్రూపు హమాస్‌ చేసిన మెరుపు ఆకస్మిక దాడులపైన అత్యవసరంగా చర్చించటానికి సమావేశమైన ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో రష్యా, చైనాలు మధ్యప్రాచ్య శాంతి చర్చల పునరుద్ధరణ జరగాలని వాదిం చాయి. యుద్ధ విరమణ తక్షణమే జరగటం ముఖ్యం. ఎప్పటినుంచో ఆగిపోయిన అర్థవంతమైన చర్చలు జరగాలంటే కాల్పుల విరమణ అవసరమని రష్యా శాశ్వత ప్రతినిధి వాస్సిలీ నెబెన్జియా భద్రతామండలిలో చేసిన ఉపన్యాసంలో పేర్కొంది. పౌరులపైన జరిగిన దాడులన్నింటినీ రష్యా ఖండిరచిందని నెబెన్జియా ప్రకటించింది. ప్రపంచం రెండు రాజ్యాల పరిష్కారానికి చొరవ చూపాలని చైనా రాయబారి జాంగ్‌ జున్‌ భద్రతామండలి సమావేశానికి ముందే చెప్పాడు. సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం లేనందున భద్రతామండలి ఎలాంటి సంయుక్త ప్రకటననూ విడుదల చేయలేదు. పాలస్తీనా సమస్యను పరిష్కరించటంలో అమెరికా పాలస్తీనా ప్రజల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోలేదని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అన్నారు. ఐక్యరాజ్య సమితికి చెందిన భద్రతామండలి చేసిన తీర్మానాలకనుగుణంగా పాలస్తీనా ప్రజలకు ప్రత్యేక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేయటం మినహా మరో మార్గంలేదని ఆయన ప్రకటించాడు. మాస్కోలో ఇరాకీ ప్రధాని మహమ్మద్‌ అల్‌ సుడన్‌ తో సమావేశమైనప్పుడు పుతిన్‌ ఈ విషయాలను ప్రస్తావించారు. పాలస్తీనాలో ఇటువంటి పరిస్థితి ఏర్పడటానికి అమెరికానే ప్రధాన కారణమని అంతకుముందు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్‌ రోవ్‌ ఆరోపించారు. హమాస్‌ దాడిని ఖండిరచమని 15దేశాల సభ్యత్వమున్న భద్రతామండలిని అమెరికా కోరింది. అనేక దేశాలు అందుకు సమ్మతించాయని, అయితే ఏకాభిప్రాయం లేనందున సంయుక్త ప్రకటనను విడుదల చేయటం సాధ్యపడలేదని అమెరికా ఉప రాయబారి రాబర్ట్‌ ఉడ్‌ అన్నాడు. ఐక్యరాజ్య సమితి తీర్మానాలను అమలు చేయనందున పాలస్తీనాలో ఒక హింసాత్మక విషవలయం ఏర్పడిరదని అంతకుముందు రష్యా అభివర్ణించింది. మధ్య ప్రాచ్చంలోను, పాలస్తీనా`ఇజ్రాయిల్‌ సమస్యను పరిష్కరించేందుకు నియమించబడిన రష్యా, అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌, ఐక్యరాజ్య సమితితో కూడిన గ్రూపును పనిచేయకుండా చేసింది పశ్చిమ దేశాలేనని రష్యా పేర్కొంది. ప్రస్తుత పరిస్థితికి ఇజ్రాయిల్‌ కూడా కొంతవరకు కారణమని, శాంతి పక్రియను పునరుద్ధరించాలని అరబ్‌ దేశాలు కోరుతున్నాయి.