నిజామాబాద్,ఆగస్ట్6(జనం సాక్షి):మెదక్,నిజామాబాద్ జిల్లాల్లో పాలీహౌస్ సాగుచేస్తూ రైతులు బాగా సంపాదిస్తున్నారు.విత్తన ఉత్పత్తికి రైతులతో ఒప్పందాలకు కంపెనీల ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేశారు. వరి, మొక్కజొన్నకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అమెరికా వంటి దేశాల్లో యాంత్రికసాగు చేస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధిస్తున్నారరు. 50 వేల హెక్టార్ల పాలీహౌస్ సాగులక్ష్యం పెట్టుకోగా, కోటి 60 లక్షల హెక్టార్లకు దరఖాస్తులు వచ్చాయని అధికారులు అన్నారు. దేశంలో తొలిసారిగా పాలీహౌస్ సాగును హర్యానాలో ప్రారంభించారని, ఏడాదికి 150 ఎకరాల్లో సాగు చేస్తే.. తెలంగాణలో రెండేండ్లలో వేయిఎకరాల్లో సాగైందని తెలిపారు.




