Monday, 2 November 2026

పాలేరులో తుమ్మల నామినేషన్

vlcsnap-2016-04-29-16h05m36s22

ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు నామినేషన్ దాఖలు చేశారు. ఖమ్మం రూరల్ తహశీల్దార్ కార్యాలయంలో ఆయన రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ వేస్తున్న సమయంలో తుమ్మలతో పాటు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి కేటీఆర్ తదితరులు ఉన్నారు.
మరోవైపు, పాలేరులో నామినేషన్ల దాఖలుకు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలతో గడువు ముగిసింది. మొత్తం 16 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *