పిడుగుపాటుకు క్రికెట్ ఆడుతున్న ముగ్గురు బాలల మృతి
గురజాల మండలం సమాధానంపేటలో విషాదం
గుంటూరు,మే14(జనం సాక్షి): గురజాల మండలం సమాధానంపేటలో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు క్రికెట్ ఆడుతున్న ముగ్గురు బాలురులు మృతి చెందారు. మృతులు పవన్ నాయక్, హరిబాబు, మనోహర్ నాయక్‌గా గుర్తించారు. వేసవి సెలవుకావడంతో బాలురు మైదానంలో క్రికెట్ ఆడుతున్నారు. ఒక్కసారిగా వాతావరణం మారి పిడుగుల వర్షం కురిసింది. బాలురులు మైదానం నుంచే బయటకు వెళ్లేలోపే వాళ్లపై పిడుగులు విరుచుపడ్డాయి. దీంతో ముగ్గురు బాలురు అక్కడికక్కడే మృతి చెందారు. ఎప్పడూ ఉత్సాహంగా కన్పించే బాలురులు ఇకలేరని తెలియడంతో గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు.