వైసీపీ, బీజేపీ లాలూచీ రాజకీయాలు: మంత్రి కొల్లు
విజయవాడ,మే14(జనం సాక్షి): వైసీపీ, బీజేపీ లాలూచీ రాజకీయాలను ప్రజలకు వివరిస్తామని, వైసీపీ ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెడుతోందని మంత్రి కొల్లు రవీంద్ర దుయ్యబట్టారు. చల్లపల్లిలో టీడీపీ మినీ మహానాడు నిర్వహించింది. 11 కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్‌ను ఎవరూ కాపాడలేరని, ప్రధాని మోదీ లాంటి వాళ్లు 10మంది వచ్చినా జగన్‌ను రక్షించలేరని టీడీపీ నేత వర్ల రామయ్య జోస్యం చెప్పారు. చంద్రబాబు పోరాటానికి ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.