పి ఆర్ టి యు ఆధ్వర్యంలో తోటి ఉపాధ్యాయునికి చేయూత

92,500 ఆర్థిక సహాయం అందజేత
కేసముద్రం-ఆగస్టు 17- జనం సాక్షి : ఎంపీపీఎస్ ఇనుగుర్తిలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు వెంకటేశ్వరా చారి అనారోగ్యానికి గురికాగా వైద్య ఖర్చుల నిమిత్తం పి ఆర్ టి యు టి ఎస్ కేసముద్రం మండల అధ్యక్షుడు బీరం జనార్దన్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి గోపాల శ్రీధర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సహకారంతో 92,500 ఆర్థిక సహాయాన్ని అందజేసి చేయూతనందించారు.ఈ కార్యక్రమంలో మండల నోడల్ అధికారి జగన్మోహన్ రెడ్డి,వివిధ స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు వెంకటేశ్వర్లు,శాంత కుమారి,విజయ, సుశీల,యాదగిరి,ఫారుక్,రాజేందర్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.