పీతల ఫేస్‌బుక్‌లో అసభ్యకర పోస్ట్‌

కేసు నమోదు చేసిన పోలీసులు

ఏలూరు,జూలై19(జ‌నం సాక్షి): మాజీ మంత్రి, పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి శాసన సభ్యురాలు పీతల సుజాతను అసభ్యకరంగా దూషిస్తూ ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. దీనిపై భట్టువారిగూడెంకు చెందిన తెదేపా కార్యకర్త వీరేంద్ర చింతలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడిపై కఠినచర్యలు తీసుకోవాలని కోరాడు. ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సీహెచ్‌. వెంకటేశ్వర్లు తెలిపారు.

తాజావార్తలు