Tuesday, 3 November 2026

పీవీపీ ఇంటిపై బండ్ల గణెళిష్‌ దాడి

– కేసు నమోదు చేసిన పోలీసులు
హైదరాబాద్‌,అక్టోబర్‌5 (జనంసాక్షి):  సినీ నిర్మాత బండ్ల గణెళిష్‌ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై  జూబ్లీహిల్స్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రముఖ నిర్మాత, వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ) ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. బండ్ల గణెళిష్‌ తనను బెదిరించారని నిర్మాత పీవీపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం అర్థరాత్రి జూబ్లీహిల్స్‌ లోని తన ఇంటికి వచ్చిన బండ్ల గణెళిష్‌ హల్‌చల్‌ చేశాడని పీవీపీ చెప్పారు. అనుచరులతో వచ్చిన బండ్ల.. తనను బెదిరించాడని ఫిర్యాదు చేశారు. టెంపర్‌ సినిమాకు గణెళిష్‌కు ఫైనాన్స్‌గా పీవీపీ రూ.7 కోట్లు ఇచ్చారు. కొంతకాలంగా తన డబ్బు తిరిగివ్వాలని బండ్ల గణెళిష్‌ను.. పీవీపీ అడుగుతున్నారు. అయినా గణెళిష్‌ పట్టించుకోకపోవటంతో శుక్రవారం రాత్రి బండ్ల గణెళిష్‌కు మరోసారి ఫోన్‌ చేసి పీవీపీ తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని  కోరారు. కోపంతో ఊగిపోయిన బండ్ల గణెళిష్‌.. రాత్రి తన ఇంటిపై దాడి చేశాడని, అనుచరులతో కలిసి వచ్చి తననను బెదిరించాడని పీవీపీ ఆరోపించారు. ఈ మేరకు  పీవీపీ జూబ్లిహిల్స్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో,  పోలీసులు బండ్ల గణెళిష్‌ సహా మరో నలుగురిపై కేసులు నమోదు చేశారు. 420, 448, 506 రెడ్‌ విత్‌, 34 సెక్షన్ల కింద పోలీసులు బండ్ల గణెళిష్‌ తో పాటు అతడి అనుచరుల పై కేసులు నమోదయ్యాయి. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. తనకు రావాల్సిన బకాయిలు అడినందుకు బండ్ల గణెళిష్‌ తన అనుచరులతో కలిసొచ్చి దౌర్జన్యం చేశారని, బెదిరించారని పీవీపీ వాపోయారు. టెంపర్‌ సినిమాకు సినీ పైనాన్షియర్‌, సహ నిర్మాత పీవీపీ.. బండ్ల గణెళిష్‌ కు రూ.30కోట్లు పెట్టుబడి పెట్టారు. సినిమా విడుదల సమయంలో అసలు మొత్తాన్ని చెల్లించి ఇంకొంత మొత్తానికిగానూ చెక్కులను గణెళిష్‌ ఇచ్చాడు. మిగిలిన డబ్బు చెల్లించాలని బండ్ల గణెళిష్‌ ని కొంతకాలంగా పీవీపీ కోరుతున్నారు. దీంతో గణెళిష్‌ మనుషులు తన ఇంటికి వచ్చి బెదిరింపులకు పాల్పడ్డారని పీవీపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం బండ్ల గణెళిష్‌ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. బండ్ల గణెళిష్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.