కృష్ణా పుష్కరాలు ఆఖరి ఘట్టానికి చేరుకున్నాయి. ఇవాళ చివరిరోజు కావడంతో పుణ్య స్నానాల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఘాట్లలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక నిన్న పుష్కరాలకు క్యూకట్టారు వీఐపీలు. కృష్ణానదిలో స్నానం చేసి…. దేవాలయాల్లో ప్రత్యక పూజలు చేశారు. నల్గొండ జిల్లా వాడపల్లి శివాలయం ఘాట్ లో సీఎల్పీ నేత జానారెడ్డి, మట్టపల్లిలో పీసీసీ చీఫ్ ఉత్తమ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ పుష్కరస్నానం చేశారు. సాగర్ శివాలయం ఘాట్ లో పుష్కరస్నానం చేసి పూజలు చేశారు టూరిజం శాఖ చైర్మన్ పేర్వారం రాములు. ఇక మహబూబ్ నగర్ జిల్లా రంగాపూర్ పుష్కరఘాట్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బీచుపల్లి ఘాట్ లో మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య పుష్కర స్నానం చేశారు.
పుష్కరాల చివరిరోజు పోటెత్తిన భక్తులు




