పెండిరగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
ప్రతీ ఎకరానికి సాగునీరందిస్తాం
– రికార్డు స్థాయిలో కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి
– 10 నెలల కాలంలో 50 వేల పైగా ఉద్యోగాలు భర్తీ చేశాం
– లక్ష మందితో 4న పెద్దపల్లి లో బహిరంగ సభ
` మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
పెద్దపల్లి,గోదావరిఖని,డిసెంబర్ 01(జనంసాక్షి): ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ప్రతి ఎకరానికి సాగునీరు అందే విధంగా పెండిరగ్ ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.ఆదివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాష్ట్ర నీటిపారుదల ,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, బిసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రోటోకాల్ ప్రజా సంబంధాల ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ తో కలిసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పౌరసరఫరాల శాఖ విభాగం పై ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్ లు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ హెలిపాడ్ వద్దకు చేరుకున్న మంత్రుల బృందానికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పుష్ప గుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు.ధాన్యం కొనుగోలు పై అధికారుల తీసుకోవాల్సిన చర్యల గురించి పౌర సరఫరాల శాఖ కమిషనర్ డి.ఎస్. చౌహన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన తరువాత దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మన రైతులు పండిరచారని మంత్రి తెలిపారు. గతంలో ఎక్కడా లేని విధంగా సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం 500 రూపాయల బోనస్ చెల్లిస్తుందని అన్నారు. రైతులకు ఎక్కడా తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, రైతులకు రికార్డు సమయంలో వడ్ల డబ్బులు పడ్తున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సమయానికి 100% ధాన్యం డబ్బులు చెల్లించి ఉండాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సన్న రకం ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా అధికంగా కొనుగోలు చేయాలని, ప్రైవేట్ వ్యాపారులు ఎక్కడ 2800 కంటే తక్కువ ధరతో సన్న రకం ధాన్యం కొనుగోలు చేయకుండా చూడాలని అన్నారు. రాబోయే సంవత్సరంలో రేషన్ లో సన్న బియ్యం ఇస్తున్నామని, దీనికి అనుగుణంగా కనీసం 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని మంత్రి సూచించారు.ప్రజా ప్రభుత్వం ఏర్పడి సంవత్సర గడిచిన నేపథ్యంలో డిసెంబర్ 4న పెద్దపల్లి జిల్లాలో లక్ష మందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని అన్నారు.గత ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, తమ ప్రభుత్వం 10 నెలల కాలంలో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని అన్నారు. ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ ప్రైవేట్ సంస్థలో యువత ఉపాధి పొందేలా అవసరమైన నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని అన్నారు. సీఎం సభకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.పత్తిపాక రిజర్వాయర్ 2950 కోట్లు 5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించేందుకు ప్రాథమిక అంచనాలు తయారు చేశామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులు కాల్వల ఆపరేషన్, నిర్వహణ కు నిధులు కేటాయించలేదని, ప్రస్తుతం కాల్వల మరమ్మత్తు పనులు అవసరమైన చేపట్టి పూర్తి చేస్తామని అన్నారు.రామగుండం ఎత్తిపోతల పథకం 95 శాతం పూర్తయిందని, డిసెంబర్ నెలాఖరు వరకు పెండిరగ్ పనులు పూర్తి చేసి వచ్చే సీజన్ నుంచి రైతులకు సాగు నీరు అందించాలని మంత్రి సూచించారు.పాలకుర్తి ఎత్తిపోతల పథకం ప్రతిపాదనలు, నీటి కేటాయింపుల ప్రక్రియ పూర్తి కావాలని అన్నారు.మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ,లి సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ప్రకటించడంతో రైతులకు అధికంగా లాభం చేకూరుతుందని, రైతులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రాధాన్యతను సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని, 2 లక్షల రుణమాఫీ, సన్న రకం వడ్లకు 500 రూపాయల బోనస్ పథకాల లబ్ధి పొందుతున్న రైతులతో వీడియోలు చేసి ప్రచారం చేయాలని , గ్రామాలలో లబ్ధిదారుల జాబితా ప్రదర్శించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.చిన్న కాళేశ్వరం ముక్తేశ్వర ఎత్తిపోతల పథకం గత 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైందని, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ త్వరగా చేపట్టాలని అధికారులకు సూచించారు. దేవాదుల ప్రాజెక్టుగా సంబంధించి మరిన్ని అవుట్ లెట్ నిర్మాణం చేయాలని అన్నారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మించడం వల్ల 2.4 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు కొత్తగా మరో 15 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,లి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ధాన్యం సేకరణ సజావుగా జరుగుతుందని అన్నారు. రైస్ మిల్లర్లు కూడా ప్రభుత్వ పాలసీ అనుసరిస్తూ సహకారం అందిస్తున్నారని అన్నారు. జిల్లాలో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకులాలు, సంక్షేమ హాస్టల్స్ ను కలెక్టర్, ఉన్నతాధికారులు రెగ్యులర్ గా తనిఖీ చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలని అన్నారు. మెస్ చార్జీల బిల్లులను గ్రీన్ చానేళ్ళ ద్వారా సరఫరా చేస్తామని అన్నారు.అనంతరం మంత్రుల బృందం సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 4న పాల్గొనే యువ శక్తి సభా స్థలిని పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్ల పై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించి ముఖ్య మంత్రి సభ నిర్వహణ, లో 9, వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం జరుగుతుందని, రైతులకు వరి ధాన్యం సన్నాళ్లకు 500 బోనస్ , మహిళలకి 500 గ్యాస్ సిలిండర్ సబ్సిడీ, తదితర అంశాలపై మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టులు, ధాన్యం కొనుగోలు, సన్న రకం వడ్లకు బోనస్ వంటి అంశాల పై తీసుకున్న నిర్ణయాలను వెల్లడిరచారు.ఈ సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, కవ్వంపల్లి సత్య నారాయణ, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పామెలా సత్పతి, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ రa, జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్, పెద్దపల్లి అదనపు కలెక్టర్ లు డి.వేణు, జే.అరుణ శ్రీ, అదనపు కలెక్టర్ , రెవెన్యూ డివిజన్ అధికారులు,నీటిపారుదల శాఖ అధికారులు, పౌర సరఫరాల శాఖ అధికారులు, సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు.