Tuesday, 3 November 2026

పెట్టుబడులకు హైదరాబాదే సేఫ్‌

8

డిఫెన్స్‌, ఏరోసెఫ్‌ రంగాలకు అనుకూలం

అమెరికా ప్రతినిధి బృందంతో ఐటీ మంత్రి కేటీఆర్‌ భేటీ

హైదరాబాద్‌, డిసెంబర్‌ 2 (జనంసాక్షి) : పెట్టుబడులకు హైదరాబాద్‌ సురక్షితమైన నగరమని అమెరికా ప్రతినిధి బృందంతో ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. డిఫెన్స్‌, ఏరోసేఫ్‌ రంగాలకు పూర్తి అనుకూలమన్నారు. పంచాయతీరాజ్‌ మరియు ఐటీ శాఖా మంత్రిని అమెరికా ప్రతినిధి బృందం సచివాలయంలో కలిసింది. పర్యటించాల్సిందిగా కోరడం జరిగింది. ఉత్తర భారతదేశం కన్నా అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన దక్షిణ భారతదేశం అందునా హైదరాబాద్‌కి అధ్యక్షుడు రావడం వల్ల నిజమైన భారత దేశ ప్రగతి తెలుసుకునే అవకాశం కలుగుతుందని అమెరికా ప్రతినిధి బృందానికి తెలియజేశారు. హైదరాబాద్‌కి ఉన్న చారిత్రాక నేపధ్యం, సాంకేతిక, పారిశ్రామిక రంగాల్లో జరిగిన అభివృద్ధిని మంత్రి అమెరికా ప్రతినిధి బృందానికి వివరించారు. వారం రోజుల కింద నేషనల్‌ ట్రావెల్‌ మ్యాగజైన్‌ హైదరాబాద్‌ని రెండో అత్యుతత్తమ నగరంగా ప్రకటించిన విషయాన్ని ఆయన తెలిపారు. రాజకీయ వ్యవహారాల అసిస్టేంట్‌ సెక్రటరీ పునిత్‌ తల్వార్‌ నేతృత్వంలో వచ్చిన ప్రతినిధి బృందం పలు అంశాల మీద చర్చించారు. భారతదేశంతో వాణిజ్యపరమైన సంబంధాలను విస్తృతం చేసుకునేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ప్రతినిధి బృందం తెలిపింది. హైదరాబాద్‌లో ఉన్న వ్యాపార అవకాశాలను మంత్రి అమెరికా ప్రతినిధులకి తెలియజేశారు. అమెరికా అనుమతించే అత్యధిక హెచ్‌ 1బి వీసాలు అధికంగా హైదరాబాద్‌ నుంచే ఉన్నాయంటే ఇక్కడ ఉన్న నిపుణుల అవకాశాలను తెలుపుతుందన్నారు. ఇక ప్రస్తుతం అమెరికాతో పాటు వివిధ యూరప్‌ దేశాలు అధిక ప్రాధాన్యం ఇస్తున్న డిఫెన్స్‌ & ఏరోస్పెస్‌ విభాగాల్లో హైదరాబాద్‌ ప్రసుత్తం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని తెలిపారు. హైదరాబాద్‌లో సుమారు 15 రక్షణ సంస్థలు, రెండు ఏయిర్‌ పోర్ట్‌లో అద్భుతమైన యూన్సిలియరీ యూనిట్స్‌తో హైదరాబాద్‌ డిఫెన్స్‌ & ఏరోస్పెస్‌ రంగంలో పటిష్టంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్న ప్రతిష్టాత్మక డిఫెన్స్‌ & ఏరోస్ఫెస్‌ ప్రాజెక్టుల్లో హైదరాబాద్‌ సంస్థలకి భాగసామ్యం ఉంటుందని, అంగారకుడిపైకి పంపిన మామ్‌ ప్రాజెక్ట్‌, బ్రహ్మోస్‌ లాంటి వాటికి పరికలందించిన విషయాన్ని అమెరికన్‌ బృందానికి తెలియజేశారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న రెండు డిఫెన్స్‌ & ఏరోస్ఫెస్‌ క్లస్టర్లతో పాటు మరోకదాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామనీ తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పారిశ్రామిక విధానంతో అతి తక్కువ సమయంలో అన్ని అనుమతులు ఇవ్వడం వంటి అంశాలను వారికి తెలియజేశారు. తాము అధికారంలోకి వచ్చిన సరిగ్గా ఆరునెలల్లో అయినప్పటీకి పారిశ్రామిక వర్గాలకి సహకారం అందించడంలో ముదున్నామని తెలిపారు. తాము ఇస్తున్న సహకారం వల్ల అనేక కంపెనీలు పెట్టుబడులతో ముందుకు వస్తున్న విషయాన్ని తెలియజేశారు. డిఫెన్స్‌ & ఏరోస్ఫెస్‌ రంగంలోనే తమ ప్రభుత్వం వచ్చినాక టాటా కంపెనీ మొదటి పెద్ద పరిశ్రమ హైదరాబాద్‌కి వచ్చినట్టు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంతో పెట్టుబడులు పెట్టే కంపెనీలకి పూర్తి సహాకారం అందిస్తామని తెలియజేశారు. తెలంగాణలో పెట్టుబడులకి ఉన్న సానూకూల వాతావరణాన్ని తెలియజేసేందుకు వివిధ దేశాల్లో ప్రచారం చేసేందుకు తాము సిద్దం ఉన్నామని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *