హైదరాబాద్,సెప్టెంబర్ 14,(జనంసాక్షి): పెట్టుబడుల సాధనలో తెలంగాణ రాష్ట్రం జాతీయ సగటును అధిగమించినట్లు అసోచామ్ పేర్కొంది. పెట్టుబడుల సాధన నివేదికను అసోచామ్ విడుదల చేసింది. ఈ నివేదికలో పెట్టుబడుల సాధనలో తెలంగాణ ఐదేళ్లలో 79 శాతం వృద్ధి సాధించి ఇతర రాష్టాల్రను అధిగమించినట్లు వెల్లడించింది. కాగా ఇదే ఐదేళ్లలో జాతీయ వృద్ధిరేటు 27 శాతంగా నమోదైంది. 2011-12లో తెలంగాణకు రూ. 3.03 లక్షల కోట్లు పెట్టుబడులు రాగా అదే 2016-17లో రూ. 5.09 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపింది. పెట్టుబడులకు స్నేహపూరిత విధానాల వల్లే ఈ ఫలితాలు సాధ్యమని అసోచామ్ పేర్కొంది.





