హిందూ, ముస్లింలు కలిసి పేదరికంపై పోరాడాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. రాష్ర్టపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్ సభలో ఆయన మాట్లాడారు.
దేశంలో మతహింసపై ఆయన మొదటిసారి స్పందించారు. భారత్ లో ఎవరు ఎవరిపై మతహింసకు పాల్పడుతారన్నది ఏనాటికీ విషయం కాదన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అన్నదే భారతీయ జీవన అంతఃసూత్రమని చెప్పారు. అన్ని మతాలు, సిద్ధాంతాలు చెప్పేదొక్కటేనన్నారు. రాజ్యాంగం ప్రకారమే దేశంలో పరిపాలన కొనసాగుతోందని ప్రధాని పేర్కొన్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు ఏ వ్యక్తికి, మతానికి లేదని స్పష్టం చేశారు. ఇండియా ఫస్ట్ అన్నదే తమ మతం.. సత్యం ఒక్కటే అన్నదే తమ సిద్ధాంతం.. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ అన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని మోడీ తేల్చిచెప్పారు.




