Tuesday, 3 November 2026

స్కూళ్లు, కాలేజీల్లో భూసార పరీక్షలు

వ్యవసాయాన్ని లాభసాటి చేసేందుకు భూసార పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ల్యాబ్స్ అవసరం లేదన్నారు. పాఠశాలలు, కళాశాలలను పరీక్ష కేంద్రాలుగా ఉపయోగించుకోవాలని, విద్యార్థులే భూసార పరీక్షలు చేస్తారన్నారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పంటలు పండించే రైతులకు భూసారం తెలియాలన్నారు. ఇష్టానుసారంగా రసాయన ఎరువులు వాడుతున్నారని, భూమికి ఏమైందో తెలుసుకున్నారా అని ప్రధాని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *