సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి, ఏప్రిల్ 12రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం జోగిపేట పరాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావుట్టణం వడ్డెర బస్తీలో నూతనంగా నిర్మించిన 108 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, గూడెం లో 216 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాలను లబ్ధిదారులకు రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖల మంత్రి హరీష్ రావు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, స్థానిక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ,స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన ఈ డబుల్ బెడ్ రూమ్ కాలనీలలో నీటి వసతిని ఏర్పాటు చేయాలని కలెక్టర్ ను కోరారు. అలాగే త్వరలో కాలనీలో సీసీ రోడ్లు కూడా మంజూరు చేస్తామని తెలిపారు.
ఒక్క రూపాయి లంచం లేకుండా ఒక్క పైరవీ లేకుండా మీరు ఒక్క చెమట చుక్క చిందించకుండా మేమే వచ్చి మీకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు అందిచాం.జరిగిందన్నారు.
ఇంకా మిగిలిపోయిన 50, 100 మందికి కూడా త్వరలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందిస్తామని ఇక్కడ ఎవరికి మొఖాలు చూసి ఇయ్యలేదు. నిజమైన లబ్ధిదారులకు మాత్రమే డబల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చామని తెలిపారు.
కాబట్టి ఏ పార్టీ మీకు ఇల్లు ఇచ్చిందో గుర్తు చేసుకోవాలని, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ brs పార్టీ మీకు ఇళ్లను అందించిందని మంత్రి గుర్తు చేశారు.
మీరు కూడా ఈ విషయాన్ని గుర్తించుకొని టిఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని కోరుతున్నానని తెలిపారు.
అంతకు ముందు హైవే నుండి ఆందోల్ వరకు చేపట్ట నున్న రోడ్డు వైండింగ్ పనులకు,జోగిపేట లోబహదూర్ ఫంక్షన్ హాల్ ఉర్దూ ఘర్ కం షాదీ ఖానా భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు.
జోగిపేట పట్టణంలో డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
అనంతరం ఆందో ల్ పట్టణంలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన ను మంత్రి ప్రారంభించారు.




