Tuesday, 3 November 2026

. పేదల నీడపై ఉదారంగా ఉండండి

4

పెద్దల భూ కబ్జాపై ఉక్కుపాదం మోపండి

అఖిలపక్ష సమావేశంలో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,డిసెంబర్‌16,(జనంసాక్షి) : పేదలకు నిలువ నీడ కల్పించే విషయంలో అత్యంత ఉదారంగా ఉండాలని, భూ కబ్జాలకు పాల్పడే వారి విషయంలో మాత్రం అత్యంత కఠినంగా ఉండాలనేది ప్రభుత్వ విధానమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు స్పష్టం చేశారు. హైదరాబాద్‌ నగరంలో భూ కబ్జాల దుకాణం బంద్‌ కావాలనేది తన లక్ష్యం అని, నగరంలోని ప్రజా ప్రతినిధులు, అధికారుల అందరి సహకారం,సమన్వయంతో పనిచేస్తామని చెప్పారు. హైదరాబాద్‌ నగరంలోని పలు అంశాలకు సంబంధించి పార్టీల అభిప్రాయాలు తీసుకునేందుకు సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం మంగళవారం జరిగింది. ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ ఆలీ, మంత్రులు పద్మారావు, మహెందర్‌రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్‌, కాంగ్రేస్‌ ప్రతినిధులు మల్లు భట్టి విక్రమార్క,నిరంజన్‌,టిడిపి నుంచి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఎల్‌వి.రమణ, నర్సిరెడ్డి, బిజేపి నుంచి కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌, యంఐయం నుంచి జాప్రి, సిపిఐ నుంచి చాడ వెంకట్‌రెడ్డ, రవీంద్రకుమార్‌, సిపియం నుంచి తమ్మినేని వీరభద్రం,సున్నం రాజయ్య,టిఆర్‌ఎస్‌ నుంచి వేణుగోపాలచారి,రాజేశ్వర్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సిపి నుంచి శివకుమార్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, మెట్రో రైల్‌ ఎండి.ఎంవిఎస్‌ రెడ్డి,జిహెచ్‌ఎంసి కవిూషనర్‌ సోమేష్‌కుమార్‌, రెవిన్యూ కార్యదర్శి విూనా పంచాయితిరాజ్‌ కార్యదర్శి రేమాండ్‌ పీటర్‌, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు,ప్రభుత్వ సలహదారు బివి.పాపారావు తదితరులు పాల్గోన్నారు.    ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నగరంలోని ప్రభుత్వ భూముల ఆక్రమాణలు, కబ్జాలు, పేద నివాసాలు, రెగ్యులరైజేషన్‌ తదితర అంశాలపై రాజకీయ పక్షాల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి ప్రభుత్వ లక్ష్యాలను విడమరచి చెప్పారు. హైదరాబాద్‌ నగరంలో భూముల రేట్లు పెరుగుతున్న కొద్ది భూఅక్రమాణలు కూడా పెరిగాయని, కబ్జా రాయుళ్లకు నగరంలో ప్రభుత్వ భూముల ఆక్రమణ అత్యంత సులువుగా మారిందని చెప్పారు. సాధారణ పౌరులు హైదరాబాద్‌లో భూములుల కొనాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. భూ వివాదాలే ఇందుకు కారణం అని చెప్పారు. భూఅక్రమణలను పూర్తి స్థాయిలో అరికట్టాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వ భూమిని ఎవరైనా అక్రమించాలంటే దడ పుట్టే పరిస్థితి రావాలన్నారు. అందు కోసం కఠినమైన చట్టాలు కూడా తెచ్చే యోచన వుందన్నారు.

హైదరాబాద్‌లో ప్రభుత్వ భూమి అక్రమణలు నాలుగు రకాలుగా జరిగాయని వివరించారు. వివిధ జిల్లాల నుంచి పొట్ట కూటి కోసం వచ్చే పేదలు ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్నారని, మధ్య తరగతి ప్రజలు నివాసం ఏర్పరుచుకోవడం కోసం ప్రభుత్వ భూమి అని తెలియకుండా మధ్య వర్తుల వద్ద కొనుక్కున్న ఉదంతాలు ఉన్నాయని, పాఠశాలలు,వైధ్య శాలలు, ప్రార్ధనా మందిరాల కోసం వాడుకుంటున్న భూమి ఉందని, కబ్జాదారులు యదేచ్చగా ఆక్రమించిన భూములు ఉన్నాయని, కబ్జాకు గురైన భూముల్లో కూడా కొన్నింటిలో నిర్మణాలు ఉన్నాయని, మరికొన్ని ఖాలీ జాగాలు ఉన్నాయన్నారు. వీటిన్నంటి విషయంలో ఒకే విధానం అనుసరించడం సాధ్యం కాదని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారికి రెగ్యులరైజ్‌ చేసి నిధులు సమకూర్చుకోవడం ప్రభుత్వ లక్ష్యం కాదని, ఆడబ్బులతోనే ప్రభుత్వం నడవదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *