పోకిరి ఎస్సై అరెస్ట్

upu60wfgరంగారెడ్డి జిల్లా మేడ్చల్ ఎస్సై సతీష్ పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, అరెస్టు చేశారు. ఎస్సై సతీష్ గత కొంత కాలంగా ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. అతనిపై నిఘా ఉంచిన ఉన్నతాధికారులు, మహిళ ఫిర్యాదు నిజమేనని నిర్ధారించుకున్నారు. దీంతో అతనిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు.